
Anurag kashyap: బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ దర్శకుడు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు తెలిపారు.
'ఫూలే' సినిమా విడుదలకు బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన అనురాగ్, తక్కువ కులాలపై బ్రాహ్మణుల అధిపత్యం లేకపోయుంటే మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ ఎందుకు తిరుగుబాటు చేసేవాళ్లై ఉండేవారు? అంటూ విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, అనురాగ్ కశ్యప్‌పై పలువురు బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలుపెట్టాయి.
ఈ గొడవ మరింత ముదరడంతో అనురాగ్, బ్రాహ్మణులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ "బ్రాహ్మణులపై మూత్రం పోస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
వివాదానికి అసలైన కారణం ఏమిటంటే…
దీంతో ఇది పెద్ద సంచలనంగా మారడంతో పాటు, అతని కుటుంబాన్ని హత్య చేస్తామని, బలాత్కారం చేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణ సమాజాన్ని ఉద్దేశించి క్షమాపణలు చెప్పారు.
బాలీవుడ్ నుండి రాబోతున్న తాజా చిత్రం 'ఫూలే' ఈ వివాదానికి కేంద్రబిందువైంది.
ఏప్రిల్ 11న విడుదల కావలసిన ఈ చిత్రంపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
తమ సమాజాన్ని ఈ సినిమాలో తప్పుడు రీతిలో చూపించారని వారు ఆరోపించారు.
ఫలితంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాపై పలు మార్పులు చేయాలని సూచించింది.
అందులో భాగంగా'మాంగ్','మహర్','పేష్వాయి'అనే పదాలను తీసేయాలని,'3000 సంవత్సరాల గులామీ' అనే డైలాగ్‌ను 'కొన్ని సంవత్సరాల గులామీ'గా మార్చాలని ఆదేశించింది.
వివరాలు
బ్రాహ్మణ సమాజంతో పాటు సెన్సార్ బోర్డుపై కూడా విమర్శలు
అయితే దర్శకుడు ఈ మార్పులకు అంగీకరించకపోవడంతో,బ్రాహ్మణ సంఘాలు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
సెన్సార్ బోర్డూ కులాలపై సంభందించిన పదాలను తొలగించకుండా ఈసినిమాను విడుదల చేయలేమని స్పష్టం చేసింది.ఈక్రమంలో సినిమా చుట్టూ వివాదం కొనసాగుతూనే ఉంది.
ఈ వివాదం నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ,బ్రాహ్మణ సమాజంతో పాటు సెన్సార్ బోర్డుపై కూడా విమర్శలు చేశారు.
ఆయన రాసిన పోస్టులో.. "నా జీవితంలో నటించిన తొలి నాటకం మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే మీదే. ఈ దేశంలో కులవాదం లేకపోతే వారిద్దరూ ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది?నేటి బ్రాహ్మణులు సిగ్గుపడుతున్నారా?లేక మిగతావాళ్లు చూడలేని మరో రకమైన బ్రాహ్మణులు భారతదేశంలో ఉన్నారా?దయచేసి ఎవరైనా వివరించండి.ఇక్కడ నిజంగా ఎవరు మూర్ఖులు?"అని ప్రశ్నించారు.
వివరాలు
సెన్సార్ సభ్యుల అనుమతితోనే..
ఇక మరో పోస్టులో, అనురాగ్ సెన్సార్ వ్యవస్థను మోసపూరితమైనదిగా అభివర్ణించారు.
"ఒక సినిమా సెన్సార్‌కు వెళ్తే, బోర్డులో నలుగురు సభ్యులు ఉంటారు. సినిమా సెన్సార్ అయిన తర్వాత దాని విషయాలు బాహ్య ప్రపంచానికి ఎలా బయటపడతాయి? బహిరంగంగా సినిమాను అడ్డుకోవాలని ఎలా చెబుతున్నారు?
ఇదంతా సెన్సార్ సభ్యుల అనుమతితోనే జరుగుతుంది. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారింది.
కులవాదాన్ని ఎత్తిచూపే సినిమాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోంది. వారికి నిజం చెప్పడానికే సిగ్గు. వాళ్లంతా పిరికివాళ్లు," అని ధ్వజమెత్తారు.
వివరాలు
మీరు నిజంగా బ్రాహ్మణులా?
ఇంకొక పోస్ట్‌లో, CBFCని ఉద్దేశించి అనురాగ్.. "ధడక్ 2 సినిమా సమయంలో, మోడీ ప్రభుత్వం భారతదేశంలో కుల వ్యవస్థ లేదని చెప్పింది. కానీ అదే కారణంతో 'సంతోష్' సినిమా కూడా విడుదల కాలేదు.
ఇప్పుడు బ్రాహ్మణులు 'ఫూలే' సినిమాను అడ్డుకుంటున్నారు. మీరు నిజంగా బ్రాహ్మణులా? లేక బ్రాహ్మణత్వాన్ని దక్కించుకున్న పితృస్వామ్య నాయకులా? కులవ్యవస్థ లేకపోతే, మీరు బ్రాహ్మణులుగా ఎలా ఉన్నారు? మోడీ చెప్పినట్లు భారతదేశంలో కులవ్యవస్థ లేకపోతే, మీరు ఉనికిలో ఉన్నారా? లేక మిగతావాళ్లు మోసపోతున్నారా? భారతదేశంలో కులతత్వం ఉందో లేదో ఒకసారి తేల్చుకోండి. ప్రజలు అజ్ఞానులు కాదు. మీరు నిజమైన బ్రాహ్మణులా లేక బ్రాహ్మణత్వంతో రాజ్యం చేయాలనుకునేవారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి," అని వ్యాఖ్యానించారు.