Spirit: 'స్పిరిట్' సెట్‌లో అగ్ని ప్రమాదం.. షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' షూటింగ్ సందర్భంగా అనుకోని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఫిలింనగర్ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టెంట్లు, అలాగే కొన్ని ముఖ్యమైన షూటింగ్ సామాగ్రి భాగంగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో చిత్ర యూనిట్‌కు చెందిన సహాయక బృందంలోని ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
వివరాలు
పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్
అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్‌లో లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ ప్రమాదం కారణంగా షూటింగ్‌కు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రమాదంతో వాయిదా పడిన పనులను త్వరలోనే పునఃప్రారంభించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపడుతోంది.