LOADING...
VenkyAnil5: రాఘవేంద్రరావు చేతుల మీదుగా తొలి షాట్‌.. వెంకటేశ్‌-అనిల్‌ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం!
రాఘవేంద్రరావు చేతుల మీదుగా తొలి షాట్‌.. వెంకటేశ్‌-అనిల్‌ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం!

VenkyAnil5: రాఘవేంద్రరావు చేతుల మీదుగా తొలి షాట్‌.. వెంకటేశ్‌-అనిల్‌ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్‌ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో నవ్వుల సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ విజయాన్ని అందుకోగా, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం 'VenkyAnil5' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డి. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వివరాలు

2027 సంక్రాంతికి రిలీజ్

తొలి షాట్‌ను రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిత్రీకరించగా, ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు సాధించాలని ఆకాంక్షిస్తూ అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. దిల్‌రాజు స్క్రిప్ట్‌ను అందించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తుండగా, కల్యాణ్‌రామ్‌కు జంటగా కృతి శెట్టి కనిపించనున్నారు. పూర్తి వినోదాత్మక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేయనున్నారు. ఇక వెంకటేశ్‌ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం: 47' చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement