Loading...
Soori : కామెడీ నుంచి హీరోగా.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న సూరి
కామెడీ నుంచి హీరోగా.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న సూరి

Soori : కామెడీ నుంచి హీరోగా.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న సూరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు సూరి వందలాది సినిమాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించి 'పరోటా సూరి'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన 'విడుదలై పార్ట్‌ 1'తో కథానాయకుడిగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత 'విడుదలై పార్ట్‌ 2'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 'గరుడన్‌' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో సూరి మార్కెట్‌ కూడా మరింత పెరిగింది. 'కొట్టుక్కాలి' వంటి సినిమాతో నటుడిగా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు. గతేడాది విడుదలైన 'మామన్‌' సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రశాంత్‌ పాండియరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సూరి కథ అందించడం విశేషం.

వివరాలు

యాక్షన్ హీరోగా సత్తా చాటిన సూరి

తాజాగా విడుదలైన 'మందాడి' చిత్రంతో సూరి యాక్షన్‌ హీరోగానూ తన సత్తా చాటారు.

ప్రస్తుతం థియేటర్లలో రన్‌ అవుతున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో రూ.100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.

కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సూరి.. తన మార్కెట్‌ వాల్యూను కూడా విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నారు.

తన తదుపరి ప్రాజెక్టులకు ఏకంగా రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ అందుకుంటున్నట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో పాటు మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు సూరి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా మారి.. ఇప్పుడు రూ.100కోట్లకు పైగా గ్రాస్‌ సాధించగల సామర్థ్యం ఉన్న హీరోగా ఎదిగారు.

ADVERTISEMENT