LOADING...
Aishwarya Lekshmi: విజయ్‌కు పూర్తి మద్దతు.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు
విజయ్‌కు పూర్తి మద్దతు.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు

Aishwarya Lekshmi: విజయ్‌కు పూర్తి మద్దతు.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు విజయ్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు ఆయనకు అండగా నిలుస్తుండగా, ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దర్శకుడు మణి రత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్', 'థగ్ లైఫ్' చిత్రాలతో గుర్తింపు పొందిన హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను విజయ్‌కు పెద్ద అభిమానినని తెలిపారు.

వివరాలు

విజయ్ గొప్ప విజయాన్ని సాధించాలి

"నేను విజయ్ అన్నను ఎంతో ఇష్టపడతాను. ప్రజల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అభిమానులతో ఉన్న అనుబంధమే ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది. ప్రజా జీవితంలోకి రావాలన్న ఆయన నిర్ణయానికి నా పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. అయితే తాను కేరళకు చెందినవారినని, అందువల్ల ఆయనకు ఓటు వేసే అవకాశం తనకు లేదని చెప్పారు. రాజకీయాలపై చర్చలు అవసరమని తాను నమ్ముతానని, విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. చివరగా, విజయ్ భవిష్యత్తు గురించి తుది నిర్ణయం ప్రజలదేనని ఆమె స్పష్టం చేశారు.

Advertisement