NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / "గాండీవధారి అర్జున" టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త చిత్రం
    సినిమా

    "గాండీవధారి అర్జున" టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త చిత్రం

    "గాండీవధారి అర్జున" టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త చిత్రం
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 19, 2023, 11:53 am 0 నిమి చదవండి
    "గాండీవధారి అర్జున" టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త చిత్రం
    వరుణ్ తేజ్ కొత్త చిత్రం గాండీవధారి అర్జున మోషన్ పోస్టర్ రిలీజ్

    మెగా హీరోల్లో తన సినిమాల ద్వారా తనకంటూ భిన్నమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఆయన చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతారు. వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ముందుకు వస్తున్నాడు వరుణ్ తేజ్. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ని, టైటిల్ ని రివీల్ చేసారు. తన సినిమాలకు విభిన్నమైన టైటిల్ ని ఎంచుకునే ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ తో చేస్తున్న సినిమాకు "గాండీవధారి అర్జున" అనే టైటిల్ ని పెట్టాడు.

    యాక్షన్ సన్నివేశాలతో అలరించే చిత్రంగా గాండీవధారి అర్జున

    మోషన్ పోస్టర్ లో కనిపించిన దృశ్యాల ప్రకారం, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని తెలుస్తోంది. బిల్డింగ్ మీదకు నల్లముసుగు వేసుకున్న దుండగులు రావడం, వారిని ఎదుర్కోవడానికి చేతిలో పిస్తోల్ పట్టుకుని వరుణ్ తేజ్ రావడం వంటి దృశ్యాలు మోషన్ పోస్టర్ లో కనిపించాయి. మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్, చాలా స్టైలిష్ గా కనిపించాడు. మోషన్ మోస్టర్ లో వినిపించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. అదీగాక ముఖ్య పాత్రల్లో ఎవరు కనిపించనున్నారో వెల్లడించలేదు. ఎస్వీసీసీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను బీవీఎస్ఎస్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

    వరుణ్ తేజ్ కొత్త చిత్రం గాండీవధారి అర్జున మోషన్ పోస్టర్ రిలీజ్

    #GandeevadhariArjuna pic.twitter.com/L2p4g5FttS

    — Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు డిల్లీ క్యాప్‌టల్స్
    డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం ఐపీఎల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ

    తెలుగు సినిమా

    పుష్ప 2: డిజిటల్ రైట్స్ కోసం ఎగబడుతున్న నెట్ ఫ్లిక్స్, కుదిరితే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు అల్లు అర్జున్
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ సినిమా
    కార్తికేయ 3 పై సెన్సేషనల్ అప్డేట్: కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే అంటున్న నిఖిల్ సినిమా
    #NBK108: దసరాకు ఫిక్స్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసిన అనిల్ రావిపూడి బాలకృష్ణ

    సినిమా

    #NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్ బాలకృష్ణ
    బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట, బాలీవుడ్
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు బాలీవుడ్
    బలగం: చిన్న సినిమాకు పెద్ద గౌరవం, రెండు అంతర్జాతీయ అవార్డులు కైవసం తెలుగు సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023