Page Loader
గాండీవధారి అర్జున రిలీజ్ డేట్: ఆగస్టు బరిలో దిగుతున్న వరుణ్ తేజ్ 
ఆగస్టులో రిలీజ్ అవుతున్న గాండీవధారి అర్జున

గాండీవధారి అర్జున రిలీజ్ డేట్: ఆగస్టు బరిలో దిగుతున్న వరుణ్ తేజ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 28, 2023
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. గతకొన్ని రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు వరుణ్ తేజ్. గని చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎఫ్ 3 సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయినా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. మరి గాండీవధారి సినిమాతో ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటాడో చూడాలి. సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాండీవధారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్