Ganguly Biopic: గంగూలీ బయోపిక్ షూటింగ్ షురూ.. దాదా లుక్‌లో రాజ్‌కుమార్ రావ్ ఫొటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బాలీవుడ్ వెర్సటైల్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కోల్‌కతాలో కీలకమైన 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ బయోపిక్‌కు పూర్తి స్థాయి నేటివిటీ, ప్రామాణికత తీసుకురావాలనే ఉద్దేశంతో చిత్ర బృందం కోల్‌కతాలోని అసలు లొకేషన్లలోనే షూటింగ్ నిర్వహిస్తోంది. బెహలా వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాల వరకు గంగూలీ జీవన ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
వివరాలు
గంగూలీ సొంత నివాసంలోనే షూటింగ్
మే 26 మంగళవారం గంగూలీ పుట్టి పెరిగిన బెహలాలోని ఆయన సొంత నివాసంలో షూటింగ్ ప్రారంభమైంది. అలాగే గంగూలీ ఆర్యన్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడిన రోజుల్ని రీక్రియేట్ చేయడానికి కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈస్ట్ బెంగాల్ క్లబ్ గ్రౌండ్స్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే, కోల్‌కతా ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ స్వయంగా సెట్స్‌కు వెళ్లి చిత్రబృందంతో కొంతసేపు గడపడం విశేషంగా మారింది.
వివరాలు
కీలక పాత్రలో తాన్య
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కిస్తుండగా, లవ్ రంజన్ నిర్మిస్తున్నారు. బెంగాలీ నేపథ్య కథ కావడంతో అక్కడి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులను కీలక పాత్రల కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. గంగూలీ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటిస్తుండగా, ఆయన భార్య డోనా గంగూలీ పాత్రలో తాన్య కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రీతమ్ అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీపై మరింత చర్చ మొదలైంది.
వివరాలు
రాజ్‌కుమార్ రావు నటనపై అభిమానుల ఆసక్తి
ముఖ్యంగా 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చూపించిన మ్యాజిక్‌ను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు కూడా అదే స్థాయి నటనతో ఆకట్టుకుంటారా అనే ఆసక్తి క్రికెట్, సినీ అభిమానుల్లో నెలకొంది. రాజ్‌కుమార్ రావు కెరీర్ విషయానికి వస్తే, ఆయన ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ 'టోస్టర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతకుముందు 'మాలిక్', 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో', 'భూల్ చుక్ మాఫ్' వంటి చిత్రాల్లో నటించారు.