LOADING...
Chhaava: తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్! 
తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్!

Chhaava: తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 26, 2025
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీస్‌కి తిరిగి విక్కీ కౌశల్ జోష్‌ ఇచ్చాడు. ఛావా సినిమాతో ఆయన అప్‌కమింగ్ హీరోలకు ఆశాకిరణంగా మారాడు. అంతేకాదు, తన గత రికార్డులను తానే చెరిపేసి, కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్కీ కౌశల్ నామం మారుమోగిపోతోంది. ఇప్పటి వరకు అతడి నటనా ప్రస్థానం ఒక ఎత్తు అయితే, ఛావాతో ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ తాకుతోంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీని చూసి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఫిబ్రవరి 14 న విడుదలైన ఈ సినిమా డ్రై సీజన్‌లోనూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Details

 బయోపిక్స్‌లో విక్కీ జోరు

రియల్ లైఫ్ స్టోరీలకు ప్రాణంపోసి, వాటి గొప్పతనాన్ని మరోసారి విక్కీ కౌశల్ చాటుతున్నాడు. ఉరిలో మేజర్ విహాన్ సింగ్, సర్దార్ ఉద్దమ్‌లో ఉద్దమ్ సింగ్, శ్యామ్ బహుదూర్‌లో శ్యామ్ మనేక్షాగా విక్కీ నటన అద్భుతం. ఇప్పుడు శంభాజీ మహారాజ్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ విక్కీ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ని అందించాడు. ఈ సినిమా 300కోట్ల నెట్‌ వసూళ్లను దాటి, విక్కీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ నెట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది. దీంతో ఉరి పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి, ఛావా ద్వారా కొత్త చరిత్రను లిఖించాడు.

Details

మార్చి 27న రిలీజ్

హిందీలో సినిమా చూసిన కొంత మంది తెలుగులో కూడా విడుదల చేస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ముందుకు రాగా, మార్చి 7న సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ రోజున చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో తెలుగు బాక్సాఫీస్‌పై కూడా 'ఛావా' హవా కొనసాగే అవకాశం ఉంది.