
Happy Birthday Geetha Madhuri: 'చమ్కా చమ్కా' సాంగ్‍తో ఊపేసిన గీతామాధురి కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
చిరుతలోని చమ్కా చమ్కీ చమ్కీరే, గోలీమార్ లోని మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు పాటల పేర్లు చెప్పగానే సింగర్ గీతా మాధురి గుర్తొస్తుంది. మాస్ సాంగ్స్ పాడటంలో గీతా మాధురి స్టయిలే వేరు.
ఈరోజు గీతా మాధురి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
2007లో కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాసా సినిమాలో గీతామాధురి మొదటి పాట పాడింది. 2008లో చిరుత సినిమాలో చమ్కా చమ్కా చమ్కీరే పాటతో మంచి పేరు తెచ్చుకుంది.
చమ్కా చమ్కా చమ్కీరే పాటకు బెస్ట్ ఫీమేల్ సింగర్ గా గీతామాధురి CineMaa అవార్డ్ అందుకుంది. అదే సంవత్సరం, నచ్చావులే సినిమాలోని నిన్నే నిన్నే కోరా పాటకు నంది అవార్డు అందుకుంది.
Details
యాక్టర్ నందుతో వివాహం
గీతా మాధురి తన కెరీర్లో రెండు నంది అవార్డులను అందుకుంది. గుడ్ మార్నింగ్ సినిమాలోని యదలో నదిలాగా పాటకు 2012లో మరో నంది అవార్డును అందుకుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గీతామాధురి పాటలు పాడారు. పెద్దయ్యాక ఎయిర్ హోస్ట్ అవ్వాలని చిన్నప్పుడు గీతామాధురి అనుకునేదట. కానీ సింగర్ గా మారింది.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే, యాక్టర్ నందుతో గీతామాధురి వివాహం 2014లో జరిగింది. వీరికి 2019లో ఒక పాప జన్మించింది. గీతామాధురి, యాక్టర్ నందు కలిసి అదితి అనే షార్ట్ ఫిలిమ్ లో నటించారు.
సింగర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న గీతామాధురి, టెలివిజన్ రియాలిటి షో బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్ గా నిలిచింది.