Gold Spot Glimpse: 90s జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేస్తున్న 'గోల్డ్ స్పాట్'.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్!
ఈ వార్తాకథనం ఏంటి
'గోల్డ్ స్పాట్' (Gold Spot) సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఆయన శిష్యుడు వేణు కార్తికేయన్ 'గోల్డ్ స్పాట్'తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అభిషేక్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ వింటేజ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఆకట్టుకుంటోంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఎంతో రిఫ్రెషింగ్‌గా సాగిన ఈ గ్లింప్స్‌లో పచ్చని చెట్లు, పల్లెటూరి చాయ్ కొట్లు, చిన్ననాటి అమాయకమైన ప్రేమకథను ప్రతిబింబించే అందమైన విజువల్స్ కనిపిస్తున్నాయి.
వివరాలు
అద్భుతంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్
కలర్‌ఫుల్ విజువల్స్ సినిమాకు ప్రత్యేకమైన ఫీల్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా 90ల నాటి బాల్యాన్ని గుర్తుచేసే అంశాలు ఈ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అప్పటి టీ కొట్లు, పచ్చని చెట్లు, స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, ఎలాంటి టెన్షన్ లేకుండా గడిపిన రోజులు.. ఇవన్నీ ప్రేక్షకులకు తమ చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా ఉన్నాయి.
అదే అనుభూతిని 'గోల్డ్ స్పాట్' ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందిస్తోంది.
పెద్దగా కథను రివీల్ చేయకుండా.. బాల్యం, స్నేహం, అనుబంధాల చుట్టూ సాగే ఓ అందమైన కథను ఈ సినిమా చెప్పబోతున్నట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతోంది.
వివరాలు
మూవీ తేదిని ప్రకటించలేదు
ఫస్ట్ లుక్‌లో చిన్నతనంలో ఒకే చోట ఆడుకుంటూ పెరిగిన పిల్లలు.. పెద్దయ్యాక అదే ప్రదేశానికి తిరిగి వచ్చినట్లు చూపించారు.
దీంతో గతంలో ఎంతో సంతోషంగా గడిపిన రోజులు, ఆ ప్రదేశంతో ముడిపడిన జ్ఞాపకాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా 'గోల్డ్ స్పాట్' ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాకు ఓ ప్రత్యేకమైన ఫీల్ ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. అయితే మేకర్స్ ఇప్పటివరకు సినిమా విడుదల తేదీని వెల్లడించలేదు.
ట్రైలర్, రిలీజ్ డేట్‌తో పాటు మరిన్ని అప్డేట్స్ కోసం ప్రేక్షకులు మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.