Golden Globes 2026: 'అడాల్‌సెన్స్'కు గోల్డెన్ గ్లోబ్ గౌరవం.. 2026 అవార్డుల్లో మరో ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను దక్కించుకున్న 'అడాల్‌సెన్స్' (Adolescence) సిరీస్ మరోసారి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ప్రకటించిన 'గోల్డెన్ గ్లోబ్స్ 2026' అవార్డుల్లో ఈ సిరీస్‌కు సంబంధించి ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. ఈ సిరీస్‌లో తన నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఓవెన్ కూపర్ అతి చిన్న వయసులోనే ఉత్తమ సహాయనటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఉత్తమ నటుడు (టీవీ సిరీస్) విభాగంలో స్టీఫెన్ గ్రాహంకు అవార్డు దక్కింది. అవార్డు స్వీకరించేందుకు వేదికపైకి వచ్చిన ఓవెన్ కూపర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Details
వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రియాంక చోప్రా
తనను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తన చుట్టూ ఉన్న గొప్ప నటీనటుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో పనిచేసిన అనుభవం తనకు మరపురానిదని వెల్లడించారు. ఇక ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వేడుకలకు ప్రముఖ హాస్యనటి నిక్కీ గ్లేజర్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌ల్లో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.
Details
గోల్డెన్ గ్లోబ్స్ 2026 విజేతలు వీరే..
ఉత్తమ నటుడు (టీవీ సిరీస్) : స్టీఫెన్ గ్రాహం (అడాల్‌సెన్స్) ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్ ఐ హేడ్ లెగ్స్ ఐ డిడ్ కిక్ యూ) ఉత్తమ స్క్రీన్‌ప్లే : పాల్ థామస్ (వన్ బ్యాటిల్ ఆనథర్) ఉత్తమ సహాయనటుడు (టీవీ సిరీస్) : ఓవెన్ కూపర్ (అడాల్‌సెన్స్) ఉత్తమ సహాయ నటుడు (సినిమా) : స్టెలన్ (సెంటిమెంట్ వాల్యూ) ఉత్తమ సహాయ నటి (సినిమా) : టెయానా టేలర్ (వన్ బ్యాటిల్ ఆనథర్)