LOADING...
Raid 3: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అధికారికంగా 'రైడ్ 3' ప్రారంభం 
క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అధికారికంగా 'రైడ్ 3' ప్రారంభం

Raid 3: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అధికారికంగా 'రైడ్ 3' ప్రారంభం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన 'రైడ్' మూడో భాగం అధికారికంగా మొదలైంది. అజయ్ దేవగణ్ హీరోగా, రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన 'రైడ్' (2018), 'రైడ్ 2' (2025) రెండు భారీ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్నట్లుగానే 'రైడ్ 3' స్క్రిప్ట్ సిద్ధమైందని మేకర్స్ ప్రకటించి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొత్త భాగంలో కూడా అజయ్ దేవగణ్-రాజ్‌కుమార్ గుప్తా కాంబినేషన్ ఇదే విధంగా కొనసాగనుంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఈసారి రాజ్‌కుమార్ గుప్తా మరింత పటిష్టమైన కథను, ఇంటెన్స్ నరేషన్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ మరోసారి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలోనే నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Details

రైడ్ 3 హీరోయిన్ ఎంపికపై ఆసక్తి

ఫ్రాంచైజీలో ఇప్పటివరకు రెండు స్టార్ హీరోయిన్‌లు కనిపించారు. 'రైడ్'లో ఇలియానా, 'రైడ్ 2'లో వాణీ కపూర్, ఈ రెండింటిలోనూ వారి పాత్రలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 'రైడ్ 3'కి హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి పెరిగింది. త్వరలోనే అధికారిక సమాచారాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. గత భాగాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించిన రితేష్ దేశ్‌ముఖ్, సౌరభ్ శుక్లా, సానంద్ వర్మల రీ-ఎంట్రీ గురించి కూడా చర్చ నడుస్తోంది. సపోర్టింగ్ క్యాస్ట్ బలమైనది కావడంతో, మేకర్స్ వారిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని టాక్. గత రెండు చిత్రాలకు సంగీతం అందించిన అమిత్ త్రివేదిను మూడో భాగం కోసం కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Details

ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అజయ్ దేవగణ్

ఇదిలా ఉంటే, అజయ్ దేవగణ్ ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నాడు. 'ధమాల్-4' షూటింగ్ పూర్తై పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉండగా 'రేంజర్' షూటింగ్ కొనసాగుతోంది. ఇవి రెండూ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తరువాతే 'రైడ్ 3' సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తంగా 'రైడ్ 3' అనౌన్స్‌మెంట్‌తోనే బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ మొదలైంది. అజయ్ దేవగణ్ పవర్‌ఫుల్ పాత్ర, రాజ్‌కుమార్ గుప్తా గ్రిప్పింగ్ మేకింగ్ కలిసి మూడో భాగంపై భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి.