Loading...
Aadarsha Kutumbam: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రేపే 'నారాయణమ్మ' మాస్ సాంగ్!
వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రేపే 'నారాయణమ్మ' మాస్ సాంగ్!

Aadarsha Kutumbam: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రేపే 'నారాయణమ్మ' మాస్ సాంగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam)పై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వచ్చిన ప్రచారం అభిమానుల్లో కొంత గందరగోళానికి కారణమైంది. అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేస్తూ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. 'ఆదర్శ కుటుంబం' నుంచి మొదటి సింగిల్ 'నారాయణమ్మ' సాంగ్ రేపే అంటే 2026 సెప్టెంబర్ 22న విడుదల కానుంది.

వివరాలు

అభిమానుల్లో భారీ అంచనాలు

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ పాట కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి క్లాసిక్స్ తర్వాత వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'నారాయణమ్మ' ఫస్ట్ సింగిల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రేజీ సాంగ్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందించారు. రేపు విడుదల కానున్న 'నారాయణమ్మ' పాట పూర్తిస్థాయి మాస్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

థియేటర్లలో ఈ పాటకు వింటేజ్ వెంకటేష్ మార్క్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని మేకర్స్ హింట్ ఇచ్చారు.

వివరాలు

హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి

సినిమా ప్రమోషన్స్ కోసం థమన్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్స్‌తో గట్టి ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.

ఒక్క ఈ పాటతోనే 'ఆదర్శ కుటుంబం' హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కొన్ని రోజులుగా సినిమా వాయిదా పడబోతోందంటూ వస్తున్న రూమర్లకు కూడా మేకర్స్ ఫుల్‌స్టాప్ పెట్టారు. 'ఆదర్శ కుటుంబం'ను అనుకున్న సమయానికే విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ మరోసారి స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

అక్టోబర్ 2న రిలీజ్

గాంధీ జయంతి కానుకగా 2026 అక్టోబర్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.

దీంతో దసరా సీజన్‌లో వెంకటేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది.

ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ 22న విడుదల కానున్న 'నారాయణమ్మ' మాస్ సాంగ్‌పైనే ఉంది.

ఈ పాట ప్రేక్షకులను, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT