Bharatavarsha: మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్న గోపీచంద్.. 'భరతవర్ష' టైటిల్ గ్లింప్స్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న 33వ సినిమా గురించి ఉన్న ఆసక్తికి తెరపడింది. ఈ చిత్రానికి 'భరతవర్ష' అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. టైటిల్‌కు తగ్గట్టుగానే గ్లింప్స్‌లోని దృశ్యాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
యాక్షన్ డ్రామా మూవీనా?
గ్లింప్స్‌ను గమనిస్తే, ఈ చిత్రం పీరియాడిక్ లేదా పురాణ నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నట్లు అర్థమవుతోంది. గోపీచంద్ లుక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచాయి. దేశ చరిత్రలో పెద్దగా తెలియని ఒక అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 'ఘాజీ', 'అంతరిక్షం' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన సంకల్ప్ రెడ్డి, ఈసారి గోపీచంద్‌ను విభిన్నమైన స్థాయిలో చూపించడానికి సిద్ధమవుతున్నారు.
వివరాలు
ఈసారైనా సక్సెస్ వరిస్తుందా?
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం లో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న గోపీచంద్‌కు 'భరతవర్ష' మంచి విజయం అందిస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిఫరెంట్ లుక్‌లో గోపీచంద్..
#BharataVarsha pic.twitter.com/jLx1hzeiiJ
— T Gopichand (@YoursGopichand) April 13, 2026