Gopichand33: గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్.. రేపు టైటిల్ గ్లింప్స్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపి చంద్ కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన నటించిన బీమా చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకున్నప్పటికీ, ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో గోపీచంద్ తన తదుపరి చిత్రంతో ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన 33వ చిత్రం (#Gopichand33) టైటిల్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 13, సోమవారం ఉదయం 11:17 గంటలకు విడుదల చేయనున్నట్లు Srinivasa Silver Screen అధికారికంగా ప్రకటించింది. "శాశ్వతమైన వైభవ యుగంలోని చెప్పని అధ్యాయం" అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివరాలు
హీరోయిన్‌గా రీతూ వర్మ
పోస్టర్ డిజైన్ చూస్తే, ఈ చిత్రానికి భక్తి, పురాణ నేపథ్యం ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఘాజీ', 'అంతరిక్షం' వంటి విభిన్న కథాంశాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ఆయన, ఈసారి గోపీచంద్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఇందులో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రేపు విడుదల కానున్న టైటిల్ గ్లింప్స్‌తో ఈ సినిమా కథపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.