
Devara 2: దేవర 2 ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం 'దేవర' ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, వరల్డ్‌వైడ్‌గా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దుమ్ము రేపింది. సినిమా ముగింపు సమయంలో 'దేవర 2'కు లీడ్ ఇచ్చేలా డైరెక్టర్ కొరటాల శివ మాస్టర్‌ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో దేవర 2 ఉండదనే ఊహాగానాలు వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించారని వార్తలు చక్కర్లు కొట్టాయి.
Details
వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్!
అయితే ఇటీవల జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తూ దేవర 2 తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్ పూర్తిచేసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బిజీగా ఉన్నారు. నవంబర్ లేదా డిసెంబర్ నాటికి 'డ్రాగన్' షూటింగ్‌ను పూర్తి చేయాలని యంగ్ టైగర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ వెంటనే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో 'దేవర 2' షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు.