Guntur kaaram Review: 'గుంటూరు కారం'..అంత ఘాటు లేదు
ఈ వార్తాకథనం ఏంటి
14 సంవత్సరాల తర్వాత, సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి కలిసి చేసిన సినిమా 'గుంటూరు కారం'.
భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
వైరా వసుంధర (రమ్య కృష్ణన్),రాయల్ సత్యం(జయరామ్) కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేశ్‌బాబు).
రమణకి 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు.
25 సంవత్సరాల తర్వాత, వసుంధర తెలంగాణా న్యాయ శాఖ మంత్రి అవుతుంది. రాబోయే ఎన్నికలలో ఆమె సజావుగా విజయం సాధించాలని ఆమె తండ్రి వెంకట స్వామి (ప్రకాష్ రాజ్)అనుకుంటాడు.
Details
గుంటూరు మాండలికంతో అదరగొట్టిన మహేష్
రమణ తన తల్లి వసుంధరకి అడ్డంకి కాకూడదని భావించిన వెంకటస్వామి... రమణతో తనకు తన తల్లి వసుంధరతో సంబంధం లేదని ప్రకటించే ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు.
తల్లిని ఎంతో ప్రేమించే రమణ రమణ ఎలా స్పందించాడు,పేపర్‌పై సంతకం చేశాడా, వసుంధర ఏమి చేసింది. చివరికి వారు తిరిగి కలిసారా అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు నటనే ఈ సినిమాకి హైలైట్. మహేష్ గుంటూరు మాండలికంతో ప్రేక్షకులను అక్కటుకున్నాడు.అలాగే భావోద్వేగాల్నీ పండించాడు.
ప్రకాష్ రాజ్, మరోసారి అద్భుతంగా నటించారు. మంత్రిగా,మహేష్ బాబు తాతగా మెచ్చుకోదగిన నటనను అందించారు. వీరిద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యింది.
Details
బలహీనమైన త్రివిక్రమ్ రచన
తన పాత్ర చుట్టూ కేంద్రీకృతమై ఉన్న కథలో తక్కువ సమయం ఉన్నప్పటికీ, రమ్య కృష్ణ నటనలో తనదైన ముద్ర వేసింది.
మహేష్ బాబు,వెన్నెల కిషోర్‌ల మధ్య కామెడీ నవ్వులు పూయిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం ప్రధాన బలహీనత దాని కథనంలో ఉంది. తెలిసిన కథే అయినా త్రివిక్రమ్ కథాంశాన్ని కొత్తగా చెప్పడంలో ఈసారి బలహీనమైన రచనతో నిరాశపరిచాడు.
గుంటూర్ కారంలో అనవసరమైన సన్నివేశాలతో నిండింది. మీనాక్షి చౌదరి, రాహుల్ రవీంద్రన్, జగపతి బాబు, రావు రమేష్, జయరామ్ ఇలా చాలా మంది నటులు కనిపిస్తారు కానీ, ఏ పాత్రలోనూ బలం కనిపించదు.
Details
ఆకట్టుకోలేకపోయిన గుంటూరు కారం
మొత్తానికి, గుంటూరు కారం మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, యాస, వన్-లైనర్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
ఈ సంక్రాంతి సీజన్‌లో గుంటూరు కారం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ, మహేష్ బాబు వన్-మ్యాన్ షోతో మంచి ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి.