Page Loader
Guntur Kaaram: హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లో 'గుంటూరు కారం' రికార్డ్ షోలు 
Guntur Kaaram: హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లో 'గుంటూరు కారం' రికార్డ్ షోలు

Guntur Kaaram: హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లో 'గుంటూరు కారం' రికార్డ్ షోలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2024
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి బుకింగ్‌లు తో సరికొత్త రికార్డులు నమోదు కావడం గ్యారెంటీ. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా అప్‌డేట్ ప్రకారం, గుంటూరు కారం సినిమా కోసం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో 41 షోస్ ని వారు వేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

Details 

తెల్లవారుజామున 2 గంటల నుండి షోలు

గుంటూరు కారం సినిమాకి తెలంగాణ ప్రభుత్వం నుండి అర్ధరాత్రి నుంచే ఎక్స్‌ట్రా షోలకు పర్మిషన్ రావడంతో ఆ రోజు ఆల్మోస్ట్ అన్ని షోలు గుంటూరు కారం సినిమాకే కేటాయించారు. దీంతో ఓవరాల్ గా మొదటి రోజే ఎక్కువ షోలు, ఎక్కువ థియేటర్స్, భారీ కలెక్షన్స్ తో మహేష్ బాబు బాక్సాఫీస్ బద్దలుకొడతాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 12న తెల్లవారుజామున 2 గంటల నుండి షోలు ప్రారంభమవుతాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రసాద్ మల్టీప్లెక్స్ చేసిన ట్వీట్