Page Loader
క్యాస్టింగ్ కౌచ్ పై నేనలా అనలేదంటున్న హన్సిక; ఏది పడితే అది రాయొద్దంటూ సీరియస్ 
క్యాస్టింగ్ కౌచ్ వార్తలను ఖండించిన హన్సిక

క్యాస్టింగ్ కౌచ్ పై నేనలా అనలేదంటున్న హన్సిక; ఏది పడితే అది రాయొద్దంటూ సీరియస్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 24, 2023
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక విరుచుకుపడిందనీ, తననొక హీరో డేట్ కి రమ్మని పిలిచాడనీ, ప్రతీరోజూ ఫోన్లు, మేసేజ్ లు చేసేవాడనీ, ఆ విధంగా తనను ఇబ్బంది పెట్టేవాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ హీరోకు తగిన బుద్ధి చెప్పినట్లు హన్సిక మాట్లాడిందని వార్తలు వైరల్ అయ్యాయి. టాలీవుడ్ లో ఏ హీరో గురించి హన్సిక అలా మాట్లాడి ఉంటుందోనని అందరూ ఆలోచించసాగారు. తాజాగా ఈ విషయాలపై హన్సిక స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదనీ, క్యాస్టింగ్ కౌచ్ పై తానేమీ మాట్లాడలేదనీ, ఇలాంటి అవాస్తవాలు రాయడం మానుకోవాలని ఆమె వార్నింగ్ ఇచ్చింది.

Details

అవాస్తవాలు రాయకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ 

ఒకవార్తను పబ్లిష్ చేసే ముందు అందులో నిజాలు తెలుసుకోవాలని ఏది పడితే అది రాయకూడదని అంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు, సీరియళ్ళలో కనిపించిన హన్సిక, దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఎన్టీఆర్, రవితేజ, కళ్యాణ్ రామ్, నితిన్, మంచు విష్ణు, రామ్, ప్రభాస్ ల సరన నటించింది. ఈ మధ్య తన స్నేహితుడు సోహైల్ ని ప్రేమించిపెళ్ళి చేసుకుంది హన్సిక. ప్రస్తుతం ఆమె నుండి మ్యాన్ అనే తమిళ సినిమా వస్తోంది. ఈ సినిమాలో ఫ్యాషన్ డిజైనర్ గా కనిపిస్తుంది హన్సిక.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హన్సిక ట్వీట్