Loading...
Hanuman Ansh: తెలుగులోకి 'హనుమాన్‌ అంశ్‌'.. సెప్టెంబరు 18న గ్రాండ్‌ రిలీజ్‌!
తెలుగులోకి 'హనుమాన్‌ అంశ్‌'.. సెప్టెంబరు 18న గ్రాండ్‌ రిలీజ్‌!

Hanuman Ansh: తెలుగులోకి 'హనుమాన్‌ అంశ్‌'.. సెప్టెంబరు 18న గ్రాండ్‌ రిలీజ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'హనుమాన్‌ అంశ్‌' (Hanuman Ansh). కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటిన 'హనుమాన్‌ అంశ్‌' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ సెప్టెంబరు 18న థియేటర్లలో విడుదల కానుంది.

వివరాలు

రూ.150 కోట్లకు పైగా వసూలు

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సమర్పిస్తుండటం విశేషం.

విశాల్‌ చతుర్వేది (Vishal Chaturvedi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభినవ్‌ సత్య ప్రధాన పాత్రలో నటించారు.

కేవలం రూ.2 కోట్లతో రూపొందిన సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో 'హనుమాన్‌ అంశ్‌'పై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

సెప్టెంబరు 18న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఇక్కడ ఎలాంటి స్పందనను, వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT