Hanuman Ansh: 'హనుమాన్ అన్ష్'లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిన నటి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆధ్యాత్మిక హిందీ డ్రామా 'హనుమాన్ అన్ష్' (Hanuman Ansh) ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హనుమంతుడిపై ఆయనకున్న అచంచలమైన భక్తి నేపథ్యంలో దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని రూపొందించారు. శోభినవ్ సత్య, చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ ప్రధాన పాత్రల్లో నటించారు. 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
గ్లామరస్ లుక్స్ వైరల్..
సినిమా కథ, నటీనటుల నటనతో పాటు మరో అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అదే రాంబేటి శర్మ పాత్ర. నీమ్ కరోలి బాబా భార్యగా కనిపించే ఈ పాత్రను నటి పూర్ణిమా తివారీ పోషించారు.
సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా గుర్తుపట్టలేనంతగా ఆమె లుక్‌ను మార్చుకున్నారు.
సాధారణంగా సోషల్ మీడియాలో మోడ్రన్, గ్లామరస్ లుక్స్‌లో కనిపించే పూర్ణిమ.. ఈ సినిమాలో మాత్రం పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించి ఆకట్టుకున్నారు.
'హనుమాన్ అన్ష్'లో పూర్ణిమా తివారీ నీమ్ కరోలి బాబా భార్య రాంబేటి శర్మ పాత్రలో నటించారు.
బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైన రోజుల నుంచి ఆయన జీవితంలో రాంబేటి పోషించిన పాత్రను కూడా సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది.
వివరాలు
పాత్రకు తగ్గట్టుగా మేకప్, హెయిర్‌స్టైల్..
భర్త ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్న సమయంలో భార్యగా రాంబేటి ఎదుర్కొన్న పరిస్థితులు కథలో కీలకంగా ఉంటాయి.
ఈ పాత్ర కోసం పూర్ణిమ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆధునిక దుస్తులు, గ్లామరస్ ఫొటోలతో కనిపించే ఆమె.. సినిమాలో మాత్రం చాలా సింపుల్‌గా, సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
పాత్రకు తగ్గట్టుగా మేకప్, హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్‌ను మార్చుకోవడంతో తెరపై ఆమెను చూసిన వెంటనే గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.
పాత్రలోకి పూర్తిగా లీనమై నటించడంతో పూర్ణిమకు మంచి స్పందన వస్తోంది. పూర్ణిమా తివారీ మోడలింగ్ రంగం నుంచి నటనలోకి అడుగుపెట్టారు.
'హనుమాన్ అన్ష్'కు ముందు కూడా ఆమె పలు హిందీ ప్రాజెక్టుల్లో నటించారు.
వివరాలు
ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..
టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కనిపించిన అనుభవం ఆమెకు ఉంది. ఏక్తా కపూర్‌కు చెందిన యూట్యూబ్ షో 'ప్యార్ కీ రాహే'లో నటించారు. అలాగే 'ఘుమ్ హై కిసికే ప్యార్ మే', 'చునా' వంటి ప్రాజెక్టుల్లోనూ భాగమయ్యారు.
'లకిర్రీన్', 'హర్దాంగ్', 'రాత్ అకేలీ హై' వంటి సినిమాల్లోనూ కనిపించారు. పూర్ణిమా తివారీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తరచూ తన ఫ్యాషన్, గ్లామరస్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు.
దీంతో సోషల్ మీడియాలో ఆమె కనిపించే గ్లామరస్ లుక్‌కు, 'హనుమాన్ అన్ష్'లో కనిపించిన డీగ్లామర్ లుక్‌కు ఉన్న తేడా చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.