LOADING...
Hanuman : మహేశ్ బాబుకే జై కొట్టిన హనుమాన్ డైరెక్టర్.. ఒకేసారి విడుదలవుతున్న గుంటూరు కారం, హనుమాన్ 
ఒకేసారి విడుదలవుతున్న గుంటూరు కారం, హనుమాన్

Hanuman : మహేశ్ బాబుకే జై కొట్టిన హనుమాన్ డైరెక్టర్.. ఒకేసారి విడుదలవుతున్న గుంటూరు కారం, హనుమాన్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 19, 2023
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి రేసులో టాలీవుడ్ నుంచి పెద్ద చిత్రం గుంటూరు కారం, సూపర్ మూవీ హనుమాన్ సినిమాలు జనవరి 12న ఒకే రోజున విడుదల కానున్నాయి. అయితే యంగ్ హీరో తేజ సజ్జ నటించిన భారీ చిత్రం "హనుమాన్" కూడా ఇదే బరిలో నిలుస్తోంది.ఈ రెండు సినిమాల క్లాష్ పట్ల ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. క్లాష్'పై హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను మహేష్ బాబు అభిమాని అని, తాను కూడా గుంటూరు కారం సినిమా చూస్తానన్నారు. తాము జనవరి 12ని ఎంచుకున్నాకే, గుంటారు కారం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని ఆయన గుర్తు చేశారు. దీనిపై తాము ముందుకు వెనక్కి వాయిదాలు వేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హనుమాన్, గుంటూరు కారం క్లాష్'పై ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు