
హ్యాపీ బర్త్ డే ఛార్మి: హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి జీవితంలోని ఆసక్తికర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. కొంతమంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అలాంటి వాళ్ళలో ఛార్మి కౌర్ ఒకరు.
పంజాబీ కుటుంబంలో పుట్టిన ఛార్మీ, 15ఏళ్ల వయసులోనే నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 2002లో విడుదలైంది ఈ చిత్రం.
ఆ తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో శివంగి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగార్జున సరసన మాస్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.
ఛార్మి నటనకు మంచి పేరు తెచ్చిన సినిమాల జాబితాలో అనుకోకుండా ఒకరోజు, మంత్ర, పౌర్ణమి చిత్రాలు నిలుస్తాయి. మంత్ర సినిమాలో నటనకు నంది అవార్డు దక్కించుకుంది ఛార్మి.
Details
దేవి శ్రీ ప్రసాద్ తో ప్రేమాయాణం అంటూ రూమర్స్
వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన ఛార్మి నటించింది. అటు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ప్రత్యేక పాటల్లో హీరోలతో స్టెప్పులు వేసింది.
నాగార్జున నటించిన ఢమరుకం చిత్రంలో ఛాయ్ సక్కుబాయ్ అనే పాటలో స్టెప్పులు వేసింది. అలాగే ఆర్ రాజ్ కుమార్ అనే హిందీ చిత్రంలో గందీబాత్ అనే పాటలో కాళ్ళు కదిపింది.
సాధారణంగా స్టార్ హీరోయిన్లపై పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో ఛార్మిపై కూడా అలా పుట్టుకొచ్చాయి. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో ఛార్మి ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి.
37ఏళ్ళ వయసుకు చేరుకున్న ఛార్మి ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.
Details
నిర్మాతగా మారిన ఛార్మి
తెలుగులో స్టార్ గా ఎదిగిన ఛార్మి, హిందీలో అమితాబ్ సరసన బుడ్డా హోగా తేరే బాప్ చిత్రంలో నటించింది.
హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసిన ఛార్మి, పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో సహనిర్మాతగా సినిమాలు చేస్తోంది. ఈ బ్యానర్ లో వచ్చిన మొదటి చిత్రం జ్యోతిలక్ష్మిలో తానే నటించింది.
ఇప్పటివరకు పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, లైగర్ సినిమాలు నిర్మించింది. ప్రస్తుతం హీరో రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సినిమాను నిర్మిస్తోంది.