హ్యాపీ బర్త్ డే ప్రియమణి: జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ జీవితంలోని ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగులో హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసి,ఆ తర్వాత చాలా రోజులు తెలుగుసినిమాలకు దూరమైపోయి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది ప్రియమణి. ఈరోజు ప్రియమణి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణంలో ఆసక్తి కలిగించే విషయాలు తెలుసుకుందాం. తెలుగు సినిమాతో ఎంట్రీ: 2003లో తెలుగులో తెరకెక్కిన ఎవరే అతగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైంది ప్రియమణి. ఈ సినిమా ఆమెకు అంతగా పేరు తీసుకురాలేదు. ఆఫర్లు తీసుకొచ్చిన పెళ్ళైన కొత్తలో: 2006లో రిలీజైన పెళ్ళైన కొత్తలో సినిమాతో హీరోయిన్ గా ప్రియమణికి మంచి గుర్తింపు వచ్చింది. జగపతి బాబు హీరోగా కనిపించిన ఈ సినిమాను మదన్ డైరెక్ట్ చేసారు.
తమిళంలో నటించిన సినిమాకు జాతీయ అవార్డు
2006లో కార్తి హీరోగా పరుతివీరన్(తమిళం) సినిమా రిలీజైంది. ఈ సినిమాలో ప్రియమణి నటనకు జాతీయ పురస్కారం లభించింది. బాలీవుడ్ ఎంట్రీ: దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిన ప్రియమణి, మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆతర్వాత చెన్నై ఎక్స్ ప్రెస్, అతీత్ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. విద్యాబాలన్ కు రిలేషన్: ప్రియమణి కుటుంబలో గొప్ప కళాకారులు ఉన్నారు. కర్ణాటిక్ సంగీత విద్వాంసుడు కమలా కైలాష్ కు మనవరాలు అవుతుంది ప్రియమణి. సింగర్ మాల్గుడి శోభకు మేనకోడలు అవుతుంది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ కి కజిన్ అవుతుంది ప్రియమణి. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి, నారప్ప, విరాటపర్వం, కస్టడీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది.