Page Loader
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే? 
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే?

Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ ప్రారంభించగా,అనంతరం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఈ సినిమా తుది విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు ఈ సినిమా విడుదల అనేకసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మూవీ టీమ్‌ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ, చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న విడుదల కానుందని ప్రకటించింది. ''జీవితకాలపు యుద్ధానికి సిద్ధమవండి. ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది. హరిహర వీరమల్లు జూన్ 12న మీ ముందుకి రాబోతుంది'' అంటూ పవన్ కల్యాణ్ ను హైలైట్ చేస్తూ రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

వివరాలు 

జూన్ 12 తేదీ ఖరారు

మొదట ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలనే ఉద్దేశం భావించారు. అయితే పవన్‌ కల్యాణ్ రాజకీయ,ఇతర సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్‌ ఆలస్యం అయింది. ఈ కారణంగా మే నెలకు వాయిదా వేయగా,చివరికి జూన్ 12 తేదీని ఖరారు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ పాల్గొన్న సన్నివేశాలతో పాటు మొత్తం చిత్రీకరణ పూర్తయినట్లు టీమ్ వెల్లడించింది. ఈ చిత్రాన్ని తొలుత క్రిష్ డైరెక్ట్ చేసినప్పటికీ, అనంతరం నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు.

వివరాలు 

కీలక పాత్రలలో ప్రముఖ నటులు 

పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో ఓ చారిత్రక యోధుడిగా, ఇప్పటివరకు ఆయన చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో విడుదల చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్