HHVM : హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా, మిగతా భాగం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తవుతోంది.
అత్యంత భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ నేపథ్యానికి తగ్గట్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, మధ్యలో ఎన్నికల కారణంగా కొంత విరామం తీసుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఇటీవలే షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశలో ఉంది.
పవన్ అభిమానులు హరిహర వీరమల్లు నుంచి కొత్త అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మేకర్స్ వారికి మంచి వార్త అందించారు.
వివరాలు
సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల
నూతన సంవత్సర కానుకగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్‌డేట్‌ను వెల్లడించారు.
జనవరి 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకు, స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించిన "మాట వినాలి" అనే పాటను విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈ అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగిపోయారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అందాల నటి నిధి అగర్వాల్ పవన్ సరసన కథానాయికగా నటిస్తోంది.
హరిహర వీరమల్లు చిత్రాన్నివచ్చే ఏడాది మార్చి 28న, సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.