Loading...
Anirudh-Kavya: అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి పత్రిక చూశారా? ప్రత్యేకతలు ఇవే!
అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి పత్రిక చూశారా? ప్రత్యేకతలు ఇవే!

Anirudh-Kavya: అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి పత్రిక చూశారా? ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ ఇండియాలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న సెలబ్రిటీ వివాహాల్లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌ల పెళ్లి ఒకటి. తాజాగా వీరి వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ప్రత్యేక ఆహ్వాన పత్రిక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇన్విటేషన్‌ను డిజైన్ చేసిన రంజినీ అయ్యంగార్.. దాని రూపకల్పన వెనుక ఉన్న ఆలోచనలను పంచుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా, క్లాసీగా ఉండటంతో పాటు.. చూసినవారు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా దాచుకునేలా దీనిని రూపొందించినట్లు ఆమె వెల్లడించారు.

వివరాలు

జ్ఞాపికగా నిలిచిపోయేలా డిజైన్

అనిరుధ్, కావ్యల వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రిక రూపకల్పన గురించి రంజినీ అయ్యంగార్ మాట్లాడుతూ.. ఈ జంటకు తమ ఆహ్వాన పత్రిక ఎలా ఉండాలనే దానిపై చాలా స్పష్టమైన ఆలోచన ఉందని తెలిపారు.

"ఆహ్వాన పత్రిక అందరి దృష్టిని ఆకర్షించాలి. అదే సమయంలో అతిగా, ఆర్భాటంగా కనిపించకూడదని అనిరుధ్, కావ్య కోరుకున్నారు. అందుకే నీలం, తెలుపు రంగుల థీమ్‌ను ఎంచుకున్నాం.

కేవలం ఓ కాగితంలా కాకుండా, అతిథులు దానిని ఓ మధుర జ్ఞాపికగా భద్రపరుచుకునేలా చెక్కతో తయారు చేసిన ప్రత్యేక పెట్టెలో (వుడెన్ బాక్స్) రూపొందించాం.

ఇందులో త్రీడీ ఎలిమెంట్స్‌ను కూడా చేర్చాం" అని ఆమె వివరించారు. ఈ చెక్క పెట్టెపై చేతితో గీసిన అందమైన చిత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం.

వివరాలు

గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్

ఎన్నో ఖరీదైన వివాహ ఆహ్వాన పత్రికల మధ్య తమ డిజైన్ ప్రత్యేకంగా నిలవాలన్నదే తమ ఉద్దేశమని రంజినీ అయ్యంగార్ పేర్కొన్నారు.

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం.

గ్రీస్‌లో వివాహం జరగనున్న నేపథ్యంలోనే ఆ దేశ జాతీయ జెండాలోని రంగులకు ప్రతీకగా నీలం, తెలుపు రంగులను ఆహ్వాన పత్రిక థీమ్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

వివాహం అనంతరం నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల కోసం ఈ వేడుకను ఏర్పాటు చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

వివాహ వేడుకపై అభిమానుల్లో ఆసక్తి

ఆహ్వాన పత్రిక డిజైనింగ్ సమయంలో అనిరుధ్, కావ్య ఇద్దరూ డిజైనింగ్ బృందంతో నిరంతరం సంప్రదింపులు జరిపారని రంజినీ అయ్యంగార్ తెలిపారు.

తమకు కావాల్సిన మార్పులపై ఎప్పటికప్పుడు స్పష్టమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ సౌత్ ఇండియాలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.

మరోవైపు కావ్య మారన్ సన్ టీవీ నెట్‌వర్క్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌గా కూడా ఆమె సుపరిచితురాలు.

వీరిద్దరి వివాహ వేడుకపై ఇప్పటికే అభిమానులు, సినీ, క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT