Page Loader
Prabhas Kannappa : ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఆయన మీద ప్రేమతోనే ప్రభాస్ కన్నప్పలో నటించాడు
ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఆయన మీద ప్రేమతోనే ప్రభాస్ కన్నప్పలో నటించాడు

Prabhas Kannappa : ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఆయన మీద ప్రేమతోనే ప్రభాస్ కన్నప్పలో నటించాడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. మంచు కుటుంబం నుంచి వస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా, సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇదివరకే ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నారు.

Details

మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు

ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఓ ఇంటర్వ్యూలో హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు తెలిపారు. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు.