Aamir Khan: 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' ఆరోపణలపై అమీర్ ఖాన్ స్పందన ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' ఆరోపణలపై ఆయన స్పందించారు. రెడిట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన అమీర్, తమ కుటుంబం ఎప్పటి నుంచో అన్ని మతాలను గౌరవించే సమ్మిళిత కుటుంబమని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో అంతర్మత వివాహాలు చాలా కాలంగా జరుగుతున్నాయని అమీర్ ఖాన్ తెలిపారు. మా కుటుంబం చాలా సమ్మిళితమైనది. నా ఇద్దరు సోదరీమణులు హిందువులను వివాహం చేసుకున్నారు. నా కుమార్తె కూడా హిందూ వ్యక్తినే పెళ్లి చేసుకుందని ఆయన చెప్పారు. అలాగే తన బంధువు, దర్శకుడు-నిర్మాత మన్సూర్ ఖాన్ కూడా క్రైస్తవ మహిళను వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు.
వివరాలు
గౌరి హిందువు కాదు.. క్రైస్తవురాలు
తన ప్రస్తుత భార్య గౌరి స్ప్రాట్, మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు ఎవరూ పెళ్లి తర్వాత ఇస్లాం మతంలోకి మారలేదని అమీర్ స్పష్టం చేశారు.
మేమంతా సివిల్ మ్యారేజ్ చేసుకున్నాం. అందువల్ల గౌరి, కిరణ్, రీనా ఎవరూ తమ మతాన్ని మార్చుకోలేదని తెలిపారు.
అంతేకాదు గౌరి హిందువు కూడా కాదు. ఆమె క్రైస్తవురాలు. అయితే ఆమె కూడా మతాన్ని ఎక్కువగా ఆచరించే వ్యక్తి కాదని అమీర్ వెల్లడించారు.
వివరాలు
సోషల్ మీడియాలో రాజకీయ, మతపరమైన వాదనలు
అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. రీనా దత్తాతో 1986లో వివాహం చేసుకున్న ఆయన, 2002లో విడాకులు తీసుకున్నారు.
వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు.
ఈ జంట 2021లో విడిపోయినా, తమ కుమారుడు ఆజాద్‌ను కలిసి పెంచుతున్నారు.
ఇటీవల గౌరి స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో రాజకీయ, మతపరమైన చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
ముస్లిం వ్యక్తి ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవాలంటే ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించాలంటూ కొందరు మత పెద్దలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
వివరాలు
అమీర్‌పై ఫత్వా
అమీర్ ఖాన్‌పై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఫత్వా జారీ చేశారు.
ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం వ్యక్తి ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం ఇస్లాం ప్రకారం హరామ్. అది తప్పు కాదని భావించే వారు అల్లాహ్‌కు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఫత్వాపై అమీర్ ఖాన్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
వివరాలు
గౌరితో ప్రేమ.. వివాహం
అమీర్ ఖాన్, గౌరి స్ప్రాట్‌కు దాదాపు 25 ఏళ్లుగా పరిచయం ఉంది.
అయితే రెండేళ్ల క్రితం బెంగళూరులో అమీర్ బంధువు నుజ్హత్ ఖాన్ ద్వారా వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది.
రెండేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ఈ జంట జూలై 5న వివాహ బంధంతో ఒక్కటైంది.
గతేడాది తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అమీర్ ఖాన్ తొలిసారి గౌరి స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేశారు.