Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం డైరెక్టర్‌గా కొత్త ప్రయాణం.. 'KA13' షూటింగ్ ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్‌లో మరో కీలక అడుగు వేస్తూ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 13వ చిత్రానికి తాత్కాలికంగా 'KA13' అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో కిరణ్ అబ్బవరం కేవలం హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించడం విశేషం. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం కావడంతో సినీ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
వివరాలు
సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న కిరణ్
జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో లాడ్జ్ లేదా హోటల్ రిసెప్షన్ వద్ద కనిపించే బెల్‌ను నొక్కుతున్న దృశ్యం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే, కిరణ్ అబ్బవరం ఈసారి కాన్సెప్ట్ ఆధారిత సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. హీరోగా విజయాల కోసం ప్రయత్నిస్తున్న కిరణ్ అబ్బవరం, దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో 'KA13'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.