NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్ 
    తదుపరి వార్తా కథనం
    చిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్ 
    ఐ రీసెర్చ్ సెంటర్ కి 10లక్షలు విరాళంగా ఇచ్చిన సిద్ధార్థ్

    చిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 28, 2023
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొన్ని రోజుల క్రితం టక్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో సిద్ధార్థ్, సరైన విజయాన్ని అందుకోలేక పోయారు.

    ప్రస్తుతం సిద్ధార్థ్ నుండి చిత్తా అనే ఎమోషనల్ డ్రామా వస్తోంది. చిత్తా సినిమా ట్రైలర్ ని హీరో సూర్య రిలీజ్ చేశారు. ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    చిత్తా సినిమా ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయింది. చిత్తా మూవీ థియేటర్లలో విడుదల కావడానికి ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు.

    ఈ ప్రీమియర్స్ కి వచ్చిన వసూళ్లను హీరో సిద్ధార్థ్.. ఐ రీసెర్చ్ సెంటర్ అనే ఎన్జీవో కు విరాళంగా ఇచ్చేశారు.

    Details

    10లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన హీరో 

    చిత్తా సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన పది లక్షల రూపాయల వసూళ్ళను ఐ రీసెర్చ్ సెంటర్ ఎన్జీవో కోసం విరాళంగా హీరో సిద్ధార్థ్ ఇచ్చేశారు.

    ఐ రీసెర్చ్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ఇప్పటివరకు సుమారు 40వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లను నిర్వహించింది.

    చిత్తా సినిమాను హీరో సిద్ధార్థ సొంతంగా నిర్మించారు. తన సొంత నిర్మాణ సంస్థలో ఏ సినిమా రూపొందినా, అందులోంచి కొంతమేర ఐ రీసెర్చ్ సెంటర్ కి సహాయంగా అందిస్తానని హీరో సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.

    ఇక చిత్తా సినిమా విషయానికి వస్తే, బాబాయ్, కూతురు అనుబంధం గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. యు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    హీరోగా మారిన 30ఇయర్స్ పృథ్వీ, డార్క్ క్రైమ్ నేపథ్యంలో సినిమా మొదలు  తెలుగు సినిమా
    షార్ట్ ఫిల్మ్ మేకర్స్ తో సంతోష్ శోభన్ కొత్త చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ  సంతోష్ శోభన్
    కేబుల్ రెడ్డి: పీరియాడిక్ కామెడీ డ్రామాతో వస్తున్న యాక్టర్ సుహాస్  తెలుగు సినిమా
    హ్యాపీ బర్త్ డే అట్లీ: రాజా రాణి నుండి మొదలుకుని వెయ్యికోట్ల జవాన్ వరకు ప్రయాణం  కోలీవుడ్

    తెలుగు సినిమా

    ఉస్తాద్ భగత్ సింగ్ క్వాలిటీపై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్  ఉస్తాద్ భగత్ సింగ్
    కుమారి శ్రీమతి టీజర్: వయసు పెరిగినా పెళ్ళి చేసుకోని అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్  సినిమా
    ఏయన్నార్ శతజయంతి ఉత్సవాల్లో బాలీవుడ్ నటుడు, ముంబై నుండి హైదరాబాద్ విచ్చేసిన స్టార్ యాక్టర్  సినిమా
    అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్  నాగ చైతన్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025