Hidimba review: అశ్విన్ బాబు, నందితా శ్వేత నటించిన హిండింబ ఆకట్టుకుందా?
సినిమా: హిడింబ నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె, రాజీవ్ పిళ్ళై తదితరులు. దర్శకత్వం: అనిల్ కన్నెగంటి నిర్మాత: గంగపట్నం శ్రీధర్ సంగీతం: వికాస్ బాడిస కథ హైదరాబాద్ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. ఆ కేసుని అభయ్ (అశ్విన్ బాబు) ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అయితే ఈ కేసును పరిష్కరించడానికి ప్రత్యేకంగా కేరళ నుండి ఆద్య (నందితా శ్వేత) స్పెషల్ ఆఫీసర్ గా హైదరాబాద్ కి వస్తుంది. ఆద్య విచారణలో అమ్మాయిలను కిడ్నాప్ చేసింది కాలా బండకు చెందిన బోయ (రాజీవ్ పిళ్ళై) అని తెలుస్తుంది. బోయాను పట్టుకుని సెల్లో వేస్తారు.
ఆసక్తి పెంచిన సెకండాఫ్
అంతా అయిపోయింది అనుకున్న సమయంలో మళ్లీ అమ్మాయిల కిడ్నాప్ జరుగుతుంది. అసలు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు? ఆ కిడ్నాప్ చేసే వాళ్లకు అండమాన్ దీవుల్లోని ఆదిమ జాతి తెగలకు సంబంధం ఏంటనేది తెరమీద చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? ఈ సినిమాలోని ముఖ్య కథ సెకండాఫ్ నుంచి మొదలవుతుంది. ఫస్టాఫ్ లో బోయాను పట్టుకోవడం కోసం సాగే విచారణ చాలా ఈజీగా జరిగిపోతుంది. దానిలో పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు. కానీ ఆ తర్వాత మళ్లీ అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడంతో సాగే ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆసక్తిగా ఉంటుంది. అండమాన్ దీవుల్లోని ఆదిమ జాతిని చూపించిన విధానం, యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను నివ్వెర పరుస్తుంది.
ఎవరెలా చేశారంటే?
అశ్విన్ బాబు, నందితా శ్వేత తమ పరిధి మేరకు చాలా చక్కగా చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో అశ్విన్ బాబు ఇంకా ఆకట్టుకున్నాడు. ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా నందితా శ్వేత కొత్తగా కనిపించింది. ఈ సినిమాలో నటన పరంగా ఆమెకు మంచి రోల్ పడిందని చెప్పాలి. ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకు మ్యూజిక్ ప్రధాన బలం. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, ఇంకా కథా నేపథ్యం ప్రేక్షకులను అలరిస్తుంది. మైనస్ పాయింట్స్ హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ కథకు అడ్డు తగిలినట్టుగా అనిపిస్తుంది. లాజిక్కులు మిస్ చేయడం. ఓవరాల్ గా చూసుకుంటే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో హిడింబ సఫలీకృతమైంది.