
HIT : హిట్ 3 సూపర్ హిట్.. విశ్వక్ సేన్ పేరు సోషల్ మీడియా ట్రెండ్!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్ 3' ఈ నెల 1న వరల్డ్‌వైడ్ థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా మెరిసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా, తొలి షో నుండే హిట్ టాక్ అందుకుంది.
నాని నటించిన అర్జున్ సర్కార్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఆయన నటవిశ్వరూపాన్ని బయటపెట్టిందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
హిట్ 3 సూపర్ హిట్ టాక్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద సూపర్బ్ కలెక్షన్లు నమోదు చేసింది. తొలి రోజే రూ. రూ. 43 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లింది.
Details
సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ప్రశంసలు
అయితే ఈ నేపథ్యంలో హిట్ ఫస్ట్ కేస్ చిత్రంలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు.
కారణం - హిట్ 3 బాగుంది కానీ వైలెన్స్ అధికం, డ్రామా కొరత ఉందంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు.
ఇక, సినిమాలోని ఇన్వెస్టిగేషన్ సీన్స్ విషయంలోనూ అర్జున్ సర్కార్ కంటే, హిట్ ఫస్ట్ పార్ట్‌లో విక్రమ్ పాత్రలో విశ్వక్ సేన్ బాగా ఆకట్టుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆయన్ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ప్రశంసలు వెల్లువెత్తిస్తున్నారు. హిట్ 3లో వైలెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా, హిట్ ఫస్ట్ కేస్‌లో డ్రామాను హైలైట్ చేస్తూ, వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదే ఆడియెన్స్‌కు కనెక్ట్ అయి ఉండొచ్చని కొందరి అభిప్రాయం.