LOADING...
Holi Special Songs : హోలీ స్పెషల్ టాలీవుడ్ పాటలు.. వింటే స్టెప్పులు వేయకుండా ఉండలేరు!
హోలీ స్పెషల్ టాలీవుడ్ పాటలు.. వింటే స్టెప్పులు వేయకుండా ఉండలేరు!

Holi Special Songs : హోలీ స్పెషల్ టాలీవుడ్ పాటలు.. వింటే స్టెప్పులు వేయకుండా ఉండలేరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోలీ పండుగ అంటే పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరికీ ఆనందమే. దేశవ్యాప్తంగా ఇప్పటికే రంగుల హోలీ సంబరాలు మొదలయ్యాయి. జనాలు రంగుల్లో తడిసి ముద్దవుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పండుగకు విశిష్టమైన చరిత్ర కూడా ఉంది. సత్యయుగం నుంచే హిందూ పురాణాల్లో హోలీ ప్రస్తావన ఉందని చెబుతారు. అందరిలో ఉత్సాహాన్ని నింపే ఈ పర్వదినాన, మరింత ఆనందాన్ని రెట్టింపు చేసే కొన్ని తెలుగు హోలీ పాటలను ఓసారి గుర్తు చేసుకుందాం

Details

తెలుగు సినిమాల్లో హోలీ పాటలు

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'నాయకన్' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని 'సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు' అనే హోలీ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ పాట హోలీ సందర్భంగా ప్రత్యేకంగా వినిపిస్తూనే ఉంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, చార్మీ నటించిన ఎమోషనల్ చిత్రం 'రాఖీ'లోని 'రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్‌సే' అనే హోలీ పాటకు విశేష స్పందన లభించింది. ఈ పాటలో తారక్‌ ఎనర్జీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఇది హోలీ స్పెషల్ సాంగ్‌లలో ప్రముఖంగా వినిపిస్తుంది.

Details

హోలీకి ప్రత్యేక గీతంగా గుర్తింపు

ఇక నాగర్జున హీరోగా నటించిన 'మాస్' చిత్రంలోని 'రంగు తీసి కొట్టు' పాట హోలీ వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పాట కూడా ఇప్పటికీ హోలీ ప్రత్యేక గీతంగా గుర్తింపు పొందింది. మరోవైపు వెంకటేష్, నమ్రత జంటగా నటించిన 'జెమిని' సినిమాలోని 'దిల్ దివానా.. మై హసీనా..' పాట కూడా హోలీ పండుగ నేపథ్యంలోనే చిత్రీకరించారు. ఈ గీతం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హోలీ సాంగ్‌గా నిలిచింది. అంతేకాదు చిరంజీవి, ప్రభాస్ నటించిన సినిమాల్లో కూడా హోలీ స్పెషల్ పాటలు ఉన్నాయి. ఇలా ఎన్నో తెలుగు గీతాలు హోలీ ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ హోలీ సందర్భంగా ఈ పాటలను మరోసారి ఆస్వాదిస్తూ పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోండి!

Advertisement