తదుపరి వార్తా కథనం
Home Town Teaser: 'హోమ్ టౌన్' టీజర్.. కుటుంబ బంధాలను తట్టిలేపే ఎమోషనల్ డ్రామా!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 10, 2025
12:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఏప్రిల్ 4 నుంచి ఈ సిరీస్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా దీని టీజర్ విడుదలైంది.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా, కుటుంబ బంధాలను హత్తుకునేలా రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించగా, 'కలలు మొదలయ్యే ప్రదేశం.. తొలి ప్రేమను అనుభవించే చోటు.. ఎప్పటికీ నిలిచిపోయే స్నేహం అనే భావోద్వేగాలతో నిండిన కథాంశాన్ని ప్రెజెంట్ చేశారు.
విడదీయరాని స్నేహాలు, కుటుంబ విలువలు ఆధారంగా సాగే ఈ కథ నవ్వులు పూయిస్తూ భావోద్వేగాలకు చేరువ చేసేలా ఉంటుందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.