Loading...
418 The Film: హారర్‌ థ్రిల్లర్‌ వాయిదా.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వచ్చేస్తోంది!
హారర్‌ థ్రిల్లర్‌ వాయిదా.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వచ్చేస్తోంది!

418 The Film: హారర్‌ థ్రిల్లర్‌ వాయిదా.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వచ్చేస్తోంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రైలర్‌తోనే ఆసక్తిని పెంచిన హారర్‌ థ్రిల్లర్‌ '418' (418 The Film) విడుదల వాయిదా పడింది. కీర్తన్‌ గౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య రాజ్‌, చరణ్‌ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో '418'పై ఆసక్తి నెలకొంది. సెప్టెంబరు 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడింది. '418'ను వివిధ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని, అందుకే ప్రస్తుతానికి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ తెలిపింది.

వివరాలు

హిందీలోనూ '418'.. త్వరలో కొత్త రిలీజ్‌ డేట్

'418' విడుదల వాయిదాపై మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ''మా సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది.

అలాగే కొంతమంది ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల కోసం ఈ సినిమాను ప్రదర్శించాం. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాం. ఇతర భాషల ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాను చూశారు.

వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. ముఖ్యంగా హిందీ ఎగ్జిబిటర్లు ఈ మూవీని తీసుకునేందుకు ఆసక్తి చూపారు.

దీంతో ఈ సినిమాను హిందీలో కూడా తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలనుకుంటున్నాం.

అందుకే ప్రస్తుతం మూవీ విడుదలను వాయిదా వేశాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం'' అని మైత్రీ మూవీ మేకర్స్‌ తెలిపింది.

వివరాలు

థ్రిల్‌ పంచేలా 'ఇమ్మోర్టల్‌'

మరోవైపు సంగీత దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్న జీవీ ప్రకాశ్‌ కుమార్‌ నటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇటీవల తమిళంలో ఆయన నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఇమ్మోర్టల్‌' (Immortal Movie) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

'నాకు మరణం లేదు' అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. కయాదు లోహర్‌ కథానాయికగా నటించారు. మారియప్పన్ చిన్నా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

'ఇమ్మోర్టల్‌' సెప్టెంబర్‌ 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది. ముఖ్యంగా సినిమా సాంకేతికంగా మరో స్థాయిలో ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

తెలుగులో కూడా రిలీజ్

వీఎఫ్‌ఎక్స్‌తో పాటు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ నటనను కూడా ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నట్లు వినాయకచవితి సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.

అంతేకాదు.. 'ఇమ్మోర్టల్‌' ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. వైవిధ్యమైన కథకు థ్రిల్‌, రొమాంటిక్‌ ఎలిమెంట్స్‌ను జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

ADVERTISEMENT