Loading...
Anil Ravipudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్రేజీ బజ్.. లైనప్ చూస్తే షాకే!
డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్రేజీ బజ్.. లైనప్ చూస్తే షాకే!

Anil Ravipudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్రేజీ బజ్.. లైనప్ చూస్తే షాకే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ షోలు, మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తన తదుపరి సినిమాను మాత్రం ఆలస్యం చేయడం లేదు. తాను టార్గెట్ పెట్టుకున్న సంక్రాంతి సీజన్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. వెంకటేష్-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దాదాపు 80-90 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

వివరాలు

మహేష్ బాబుతో సినిమా రూమర్‌కు క్లారిటీ..

టైటిల్‌లోనే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసిన నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 12 విడుదల తేదీని మిస్ కాకూడదనే పట్టుదలతో అనిల్ రావిపూడి పనిచేస్తున్నాడని టాక్.

జనవరి 12 తర్వాత అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనే చర్చ కొంతకాలంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో పలువురు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా వినిపించింది.

అయితే ఈ రూమర్‌పై అనిల్ రావిపూడి స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. దీంతో మహేష్ బాబుతో అనిల్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడింది.

అయితే అనిల్ రావిపూడి చుట్టూ కొత్త గాసిప్స్ మాత్రం ఆగడం లేదు.

వివరాలు

చిరంజీవి-నాగార్జునతో మల్టీస్టారర్?

ఇప్పటి వరకు సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జునను మినహాయిస్తే మిగతా హీరోలతో సినిమాలు చేసిన లేదా వారి చుట్టూ ప్రాజెక్టులు నడిపిన అనిల్.. ఇప్పుడు నాగ్‌ను కూడా తన లిస్ట్‌లోకి తీసుకురాబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన రూమర్ తెరపైకి వచ్చింది. కింగ్ నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిపి అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ సినిమాను సిద్ధం చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి-నాగార్జున కలయికపై వస్తున్న ఈ గాసిప్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ రూమర్ కంటే మరో వార్త మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

ADVERTISEMENT

వివరాలు

యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు భిన్నంగా..

ఇప్పటి వరకు యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ జానర్‌లకు దూరంగా వెళ్లని అనిల్ రావిపూడి.. ఈసారి ఏకంగా యానిమేషన్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడనే బజ్ వినిపిస్తోంది.

రామాయణాన్ని మైథాలజీ యానిమేషన్ మూవీగా తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి స్కెచ్ వేశాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాను కేవీఎన్ నిర్మించనుందనే రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మహేష్ బాబుతో సినిమా రూమర్‌పై ఇప్పటికే స్పందించిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు తన చుట్టూ వినిపిస్తున్న చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్, రామాయణం యానిమేషన్ మూవీ గాసిప్స్‌పై కూడా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ADVERTISEMENT