Chiranjeevi: చిరంజీవిపై ఫేక్ వీడియోలు వైరల్.. యూట్యూబ్ ఛానెల్‌పై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తూ మార్ఫింగ్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆ వీడియోను ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, చిరంజీవికి సంబంధించిన అసత్య వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఒక యూట్యూబ్ ఛానెల్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిందని కమలాపురి కాలనీకి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు
మెగాస్టార్ గురించి ఫేక్ కంటెంట్..
వైరల్ అయిన ఫేక్ కంటెంట్ వల్ల మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటు సంబంధిత వీడియోలు, స్క్రీన్‌షాట్‌లను కూడా పోలీసులకు సమర్పించారు. కోర్టు అనుమతి పొందిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీడియోను వైరల్ చేసిన మరిన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.