LOADING...
Rashmika Mandanna: నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.. భరించలేకపోతున్నా: రష్మిక
నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.. భరించలేకపోతున్నా: రష్మిక

Rashmika Mandanna: నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.. భరించలేకపోతున్నా: రష్మిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న తెరపై ఎప్పుడూ ఉల్లాసంగా, చిరునవ్వుతో కనిపించినప్పటికీ, తన మనసులో దాచుకున్న ఆవేదనను ఇటీవల బయటపెట్టారు. కొన్నేళ్లుగా తాను ఎదుర్కొంటున్న ఆన్‌లైన్‌ ద్వేషం, ట్రోలింగ్‌ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ నటిగా తన పనిని నిజాయితీగా చేస్తూనే ఉన్నప్పటికీ, కొందరు ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని, తన ఎదుగుదలను అడ్డుకోవడానికి డబ్బులు ఇచ్చి మరీ ట్రోలింగ్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు. నిఖిల్‌ తనేజా హోస్ట్‌ చేసిన 'వీ ఆర్‌ యువా' ప్లాట్‌ఫారమ్‌లో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నాపై తీవ్రమైన ద్వేషం ప్రదర్శిస్తున్నారు.

Details

నెగిటివ్ కామెంట్లు ఎక్కువయ్యాయి

ప్రతిరోజూ నిద్రలేవగానే నన్ను ద్వేషిస్తూ వచ్చే నెగటివ్‌ కామెంట్లే కనిపిస్తున్నాయి. అందరికీ నేనే పంచ్‌ బ్యాగ్‌లా కనిపిస్తున్నానా? ఈ నొప్పిని భరించడం నాకు చాలా కష్టమవుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. తనపై జరిగిన మార్ఫింగ్‌ డీప్‌ఫేక్‌ వీడియో ఘటనను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తాను ఎంత భయపడ్డానో, తనకంటే ఎక్కువగా కుటుంబసభ్యులు, ముఖ్యంగా చెల్లెలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. "మా కుటుంబంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. నా వల్ల వాళ్లు భయపడటం నన్ను మరింత కలచివేసిందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఓ నటిగా నా నటనతో ప్రేక్షకులను ఆనందపర్చడానికి కృషి చేస్తున్నాను.

Details

అభిమానుల మద్దతు

అయినా నాపై ఇంత ద్వేషం ఎందుకు? నేనేం తప్పు చేశానని నన్ను ఇలా టార్గెట్‌ చేస్తున్నారు?" అని ప్రశ్నించిన ఆమె, కెరీర్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఈ తరహా వేధింపులు తనను మానసికంగా బలహీనపరుస్తున్నాయని వాపోయారు. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఆవేదనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మద్దతు తెలియజేస్తూ స్పందిస్తున్నారు.