LOADING...
Shakila: రాధిక కంటే నేనే బెస్ట్.. సీనియర్ నటి షకీలా సంచలన వ్యాఖ్యలు
రాధిక కంటే నేనే బెస్ట్.. సీనియర్ నటి షకీలా సంచలన వ్యాఖ్యలు

Shakila: రాధిక కంటే నేనే బెస్ట్.. సీనియర్ నటి షకీలా సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లపై ఆధారపడకుండా బలమైన కథలతో రూపొందుతున్న చిన్న సినిమాలు థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో తమిళంలో తెరకెక్కిన 'తాయ్ కిళవి' ఒకటి. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాలో రాధిక తన నటనతో మెప్పించగా, ఆమె లుక్, మేకోవర్, నటన చాలా భిన్నంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వివరాలు

షకీలా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్

కథ, కామెడీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక తాజాగా ఈ సినిమాపై సీనియర్ నటి షకీలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధిక కంటే తాను ఇంకా బాగా నటించేదాన్నని షకీలా చెప్పడం చర్చనీయాంశమైంది. కెరీర్ ప్రారంభంలో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న షకీలా, ఎన్నో చిత్రాల్లో వ్యాంప్ పాత్రల్లో నటించారు.

వివరాలు

రాధిక కంటే నేను ఇంకా బాగా చేసేదాన్ని

ఒకప్పుడు స్టార్ హీరోలకు సైతం పోటీగా ఆమెకు భారీ క్రేజ్ ఉండేది. అనంతరం సినిమాలను తగ్గించిన ఆమె, ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు షో కూడా పాల్గొన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.. 'తాయ్ కిళవి' సినిమాలో రాధిక స్థానంలో నేను నటించి ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. అలాంటి పాత్రల్లో ఆమెకంటే నేనే మెరుగ్గా నటించగలను. ఇటీవల ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ఆ పాత్ర నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేను ఇంకా బాగా చేసేదాన్ని అనిపించిందని పేర్కొన్నారు. షకీలా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement