Loading...
Nani: మలయాళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!
మలయాళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

Nani: మలయాళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

'జడల్‌' పాత్రతో సందడి చేసేందుకు నటుడు నాని సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ది ప్యారడైజ్‌' (The Paradise). శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాని వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా కొచ్చిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ.. 'ది ప్యారడైజ్‌'కు ఇంకా సెన్సార్‌ పూర్తికాలేదని తెలిపారు. ఈ సినిమాకు 'A' సర్టిఫికెట్‌ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రాలేరన్నది వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే త్వరలోనే తన నుంచి కుటుంబ కథా చిత్రాలు వస్తాయని తెలిపారు. ఒక నటుడిగా అన్ని రకాల జానర్లను ప్రయత్నించాలని ఉందని నాని అన్నారు.

వివరాలు

ఈ ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకోవచ్చు

మరో రెండు సినిమాల తర్వాత మళ్లీ 'భలే భలే మగాడివోయ్‌' తరహా చిత్రంలో నటిస్తానని వెల్లడించారు. 'హిట్‌ 3' (Hit 3) ప్రచారం కోసం కొచ్చి వచ్చాను. ఏడాదిన్నర గడిచినా నాకు నిన్న వచ్చినట్లుగానే అనిపిస్తోంది.

ఇక్కడి వాళ్లు అంత ప్రేమ చూపిస్తారు. మలయాళం సినిమాలంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను.

ఈ ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా సమయాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకుంటారు.

మంచి సినిమాలను అందిస్తారు. ఇది అన్ని పరిశ్రమలూ నేర్చుకోవాలి'' అని నాని ఈ సందర్భంగా అన్నారు. ఇక 'ది ప్యారడైజ్‌' ట్రైలర్‌ను విడుదల చేయకపోవడంపై కూడా నాని స్పందించారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్న కారణంగా ట్రైలర్‌ను తీసుకురాలేకపోయామని చెప్పారు.

ADVERTISEMENT