Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను 'ఫలక్‌నుమా దాస్' కోసం 3 నెలలు బతిమిలాడా: విశ్వక్ సేన్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను నటుడిగా మార్చేందుకు తాను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో హీరో విశ్వక్ సేన్ సరదాగా గుర్తుచేసుకున్నారు. 'ఫలక్‌నుమా దాస్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు తరుణ్ భాస్కర్‌ను ఏకంగా మూడు నెలల పాటు బతిమిలాడాల్సి వచ్చిందని వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వివరాలు
బిస్కెట్ చేతిలో పెట్టి మరీ బతిమిలాడా..
'ఫలక్‌నుమా దాస్' షూటింగ్ ప్రారంభమైన సమయంలో తరుణ్ భాస్కర్‌తో పోలీస్ పాత్ర చేయించాలని తాను అనుకున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు.
అయితే ఎన్నిసార్లు అడిగినా తరుణ్ మాత్రం నటించేందుకు ఒప్పుకోలేదని చెప్పారు. "'ఫలక్‌నుమా దాస్' షూటింగ్ మొదలైనప్పుడు తరుణ్‌తో పోలీస్ క్యారెక్టర్ చేయించాలనుకున్నాను.
కానీ ఎన్నిసార్లు అడిగినా 'నేను యాక్టింగ్ చేయనురా బాబు' అంటూ తప్పించుకునేవాడు. దాంతో ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను నెలల తరబడి వాయిదా వేస్తూ వచ్చాం.
ఓరోజు రామానాయుడు స్టూడియోలో ఫోటోషూట్‌లో ఉన్న తరుణ్ దగ్గరికి వెళ్లి, చేతిలో బిస్కెట్ పెట్టి మరీ బతిమిలాడాను. నేను వదిలేలా లేనని అర్థమై చివరకు ఆ రోజు సాయంత్రానికి ఓకే చెప్పాడని విశ్వక్ వివరించారు.
వివరాలు
అప్పుడు నటించనన్నాడు.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు!
గతంలో నటించమని ఎంతగా అడిగినా ఒప్పుకోని తరుణ్ భాస్కర్.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తుండటంపై విశ్వక్ సేన్ చమత్కరించారు.
అప్పుడేమో అంతలా బతిమిలాడినా చేయనన్నాడు.. ఇప్పుడేమో వరుసగా సినిమాలు చేస్తూ ఎక్కడా ఆపేలా కనిపించట్లేదు.
ఎవరైనా వచ్చి అమాయకంగా ముఖం పెట్టి అడిగితే కాదనలేక ఒప్పుకునే మనస్తత్వం తరుణ్‌ది. అందుకే ఇప్పుడు చాలామంది ఆయనతో నటింపజేస్తున్నారనిపిస్తోంది.
పైగా కాదనలేని క్రేజీ ఆఫర్లు కూడా ఆయనకు వస్తున్నాయి" అని నవ్వుతూ చెప్పారు.
వివరాలు
దర్శకుడిగా జాతీయ అవార్డు.. నటుడిగా వరుస సినిమాలు
తరుణ్ భాస్కర్ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.
'ఫలక్‌నుమా దాస్' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఒకప్పుడు నటించేందుకు ఇష్టపడని తరుణ్ భాస్కర్, ఇప్పుడు ఫుల్‌టైమ్ యాక్టర్‌గా దూసుకుపోతుండటాన్ని విశ్వక్ సేన్ సరదాగా గుర్తుచేసుకున్నారు.