Loading...
Jyothika: తుది శ్వాస నీ ఒడిలోనే విడవాలి.. సూర్యపై జ్యోతిక ఎమోషనల్ కామెంట్స్‌!
తుది శ్వాస నీ ఒడిలోనే విడవాలి.. సూర్యపై జ్యోతిక ఎమోషనల్ కామెంట్స్‌!

Jyothika: తుది శ్వాస నీ ఒడిలోనే విడవాలి.. సూర్యపై జ్యోతిక ఎమోషనల్ కామెంట్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్‌ కపుల్‌ సూర్య, జ్యోతిక వైవాహిక బంధానికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. వీరిద్దరూ 2006 సెప్టెంబరు 11న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా 'ది సీక్వెల్‌' పేరుతో సూర్య, జ్యోతిక ఇటీవల మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తూ వారు పంచుకున్న భావోద్వేగ మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా జ్యోతిక తన భర్త సూర్యను ఉద్దేశించి మాట్లాడిన మరో భావోద్వేగభరితమైన వీడియో బయటకు వచ్చింది.

వివరాలు

సోషల్ మీడియాలో వైరల్

ఇందులో ఆమె తన భర్తపై ఉన్న ప్రేమను, ఆయనతో జీవితాంతం కలిసి ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నా జీవితంలోని చివరి క్షణాలను కూడా నీతోనే గడపాలి. నువ్వు లేకుండా నేను ఎలా నిద్రపోతానో కూడా నాకు తెలియదు.

ఒకవేళ నాకంటే ముందుగా నువ్వు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే.. నిన్ను వెతుక్కుంటూ నేను కూడా అక్కడికే వస్తాను.

ఎందుకంటే స్వర్గంలో కూడా నువ్వు నీ మాటలతో అందరినీ బోర్‌ కొట్టిస్తావని నాకు తెలుసు'' అని జ్యోతిక నవ్వుతూ తన ప్రేమను వ్యక్తం చేశారు.

అంతేకాదు.. నీ ఒడిలోనే నా తుదిశ్వాస విడవాలని కోరుకుంటున్నానంటూ భర్తపై తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

వివరాలు

అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి

జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు సూర్యతో ఆమెకున్న ప్రేమను, అనుబంధాన్ని మరోసారి ప్రతిబింబిస్తున్నాయి.

రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న ఈ జంటకు సంబంధించిన 'ది సీక్వెల్‌' వేడుక ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

తాజాగా జ్యోతిక మాట్లాడిన మాటలు కూడా నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

ADVERTISEMENT