Samantha: నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా.. అందుకే వ్యాపారాల్లోకి వచ్చా: సమంత
ఈ వార్తాకథనం ఏంటి
నటిగా, నిర్మాతగా రాణిస్తూనే.. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ సమంత ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తల్లి కాబోతున్న అనుభూతిని ఆస్వాదిస్తున్న ఆమె.. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, వ్యాపార ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో పూర్తిగా నటనకు స్వస్తి చెప్పాలని భావించినట్లు సమంత తెలిపారు. ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాలని అనిపించిందని చెప్పారు.
వివరాలు
'యాక్టింగ్ కాకుండా మరో వృత్తి చూసుకోవాలనుకున్నా'
అనారోగ్యం కారణంగా ఏడాది పాటు విరామం తీసుకున్న సమయంలో ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని భావించినట్లు సమంత వెల్లడించారు.
అనారోగ్యం కారణంగా సంవత్సరం విరామం తీసుకున్నప్పుడు ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని భావించాను.
ఇకపై ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైతే యాక్టింగ్ కాకుండా మరేదైనా వృత్తిని చూసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దాంతో నేను కాస్త భయపడి, వారి సలహాను సీరియస్‌గా తీసుకున్నానని సమంత తెలిపారు.
ఆ సమయంలో తనకు నమ్మకం ఉన్న చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. వ్యాపారవేత్తగా మారిన తర్వాత జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని వెల్లడించారు.
వివరాలు
'సిటాడెల్' షూటింగ్ చాలా ఇబ్బందిగా అనిపించింది
ఆరోగ్యం బాగాలేని సమయంలో 'సిటాడెల్' షూటింగ్‌లో పాల్గొనడం తనకు చాలా ఇబ్బందికరమైన అనుభవంగా అనిపించిందని సమంత తెలిపారు.
ఆరోగ్యం బాగాలేనప్పుడు 'సిటాడెల్' షూటింగ్‌లో పాల్గొనడం చాలా ఇబ్బందికరమైన అనుభవం. నా వల్ల సెట్‌లో ఉన్న మిగతా వారి సమయం వృథా కాకూడదని అనుకున్నాను.
చేయలేనని చాలా ఈమెయిల్స్ పెట్టా. కానీ, వాళ్లు నేనే నటించాలని కోరడంతో అది పూర్తి చేశానని ఆమె చెప్పారు.
వివరాలు
'మా ఇంటి బంగారం'లో నటించడం వెనుక రాజ్ ప్రోత్సాహం
'మా ఇంటి బంగారం (Maa Inti Bangaram)' సినిమాకు కూడా తొలుత తాను నటిగా కాకుండా నిర్మాతగా తెరవెనుక పనిచేయాలని భావించినట్లు సమంత తెలిపారు.
'మా ఇంటి బంగారం' చిత్రానికి కూడా మొదట నిర్మాతగానే తెరవెనుక పనిచేయాలని అనుకున్నా. రాజ్ ప్రోత్సాహం, బలవంతం వల్ల నటించానని సమంత వెల్లడించారు.
వివరాలు
ట్రోలింగ్‌ను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు
తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా సమంత మాట్లాడారు. కాలం తనకు ఎన్నో విషయాలు నేర్పిందని తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అనవసరమైన మాటలను పట్టించుకోవడం పూర్తిగా తగ్గించుకున్నానని చెప్పారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు అనవసరమైన మాటలను పట్టించుకోవడం మానేశాను. నేను ఆనందంగా ఉండడానికి కారణాలను డైరీలో రాసుకునేదాన్ని. అలాగే నేను చేయాలనుకున్న పనులను కూడా నోట్ చేసుకునేదాన్ని అని సమంత తెలిపారు.
మన జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఆమె సూచించారు.
వివరాలు
ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి
నా గురించి నెగెటివ్‌గా మాట్లాడాలని ఇతరులు ఒక నిర్ణయానికి వచ్చేసినప్పుడు.. వాళ్ల అభిప్రాయాన్ని నేను ఏం చేసినా మార్చలేను.
అలాంటప్పుడు వారిని ఒప్పించడానికి నా సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకు? దానికి మించిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయని సమంత పేర్కొన్నారు.
మానసికంగా బలహీనంగా ఉన్న రోజుల్లో ట్రోలింగ్ తనను బాధించేదని.. అయితే ఇప్పుడు వాటి గురించి ఆలోచనలు చాలా వరకు తగ్గిపోయాయని సమంత వివరించారు.