LOADING...
Samantha: విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోయా.. రాజ్ నా జీవితంలోకి రావడం అదృష్టం : సమంత
విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోయా.. రాజ్ నా జీవితంలోకి రావడం అదృష్టం : సమంత

Samantha: విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోయా.. రాజ్ నా జీవితంలోకి రావడం అదృష్టం : సమంత

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా భావోద్వేగంగా స్పందించారు. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల అనంతరం తాను ఎదుర్కొన్న మానసిక వేదన, ఆ తర్వాత దర్శకుడు రాజ్ నిడమూర్‌తో ప్రారంభమైన కొత్త జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానులు, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విడాకుల తర్వాత తాను తీవ్రంగా కుంగిపోయానని సమంత గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో నా ప్రపంచాన్ని నేను పూర్తిగా మూసేసుకున్నాను. మానసికంగా బలహీనపడిపోయాను. ఇకపై ఎవరినీ నమ్మకూడదని, ఎవరికీ ఆధారపడకూడదని నిశ్చయించుకున్నాను. ప్రేమ మళ్లీ నా జీవితంలోకి వస్తుందని అస్సలు ఊహించలేదని ఆమె వెల్లడించారు.

Details

ఒక వరంగా భావిస్తున్నా

అలాంటి క్లిష్ట సమయంలో రాజ్ తన జీవితంలోకి రావడం ఒక వరంగా భావిస్తున్నానని సమంత పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రేమను, నిజమైన స్నేహాన్ని స్వీకరించగల సున్నితత్వం నాలో ఇంకా మిగిలి ఉండటం నా అదృష్టం. ఇప్పుడు నేను ఒక మంచి బంధంలో ఉన్నాను. దాని వల్లనే నేను మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా మారగలిగాను. రాజ్ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం దానికి ప్రధాన కారణమని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనలో వచ్చిన ఈ మార్పును సన్నిహితులు కూడా గుర్తించారని ఆమె చెప్పారు. ఇటీవల నా పాత స్నేహితురాలు నన్ను కలిసి వెళ్లిన తర్వాత ఒక వాయిస్ నోట్ పంపింది. 'ఇప్పుడే నువ్వు నిజంగా ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నట్టు కనిపిస్తున్నావు.

Details

సమంత-రాజ్‌ల బంధం క్రమంగా బలపడింది

ఇకపై నువ్వు ఏదీ నటిస్తున్నట్టు లేదని చెప్పింది. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయని వివరించారు. ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెట్స్‌లో 2021లో తొలిసారి పరిచయమైన సమంత-రాజ్‌ల బంధం క్రమంగా బలపడింది. ఆ పరిచయం చివరకు గత ఏడాది వారి వివాహానికి దారితీసింది. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థపై 'మా ఇంటి బంగారం' అనే చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్నారు. ఈ సినిమాకు నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆమెకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను అధిగమించి కొత్త అధ్యాయం ప్రారంభించిన సమంతకు సోషల్ మీడియాలో అభిమానులు విస్తృతంగా మద్దతు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement