Mrunal Thakur: పెళ్లి తప్పకుండా చేసుకుంటా.. కానీ : రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని రోజులుగా వరుస రూమర్లతో వార్తల్లో నిలుస్తున్నారు నటి మృణాల్ ఠాకూర్. హీరో ధనుష్‌తో ఆమె ప్రేమలో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఫిబ్రవరి 14న ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ ప్రచారాలను ఆమె ఇప్పటికే ఖండించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివాహంపై స్పష్టంగా స్పందించారు. పెళ్లి తప్పకుండా చేసుకుంటాను. కానీ అందుకు సరైన సమయం రావాలి. నా జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే వివాహ బంధంలోకి అడుగుపెడతాను. ఆ సమయంలో నేనే స్వయంగా ప్రకటిస్తాను. నా సోషల్ మీడియా ఖాతాల్లో నేనే పోస్ట్ చేస్తాను.
Details
మాజీ ప్రియుడి గురించి ఓపెన్ గా మాట్లాడిన హీరోయిన్
ఆ సంతోషాన్ని మీతో పంచుకునే మొదటి వ్యక్తి నేనే అవుతానని మృణాల్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పెళ్లిపై ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రేమికుల దినోత్సవం రోజే తన పెళ్లి జరగనుందనే వార్తలపై ఆమె హాస్యంగా స్పందించారు. ఇవాళ ఫిబ్రవరి 14 కదా... ఇంకొన్ని రోజుల్లో ఏప్రిల్ 1 వస్తుంది. అది ఫూల్స్ డే కదా అంటూ సెటైర్ వేశారు. ఇక ఇటీవల తన మాజీ ప్రియుడి గురించి కూడా ఆమె ఓపెన్‌గా మాట్లాడిన సంగతి తెలిసిందే. తాను నటిగా కొనసాగడం అతనికి నచ్చలేదని, అందుకే బ్రేకప్ చెప్పినట్లు వెల్లడించారు. అలాంటి వ్యక్తితో సంబంధం కొనసాగించడం కష్టమేనని భావించి విడిపోయినట్లు స్పష్టం చేశారు.