LOADING...
Ram Charan : మీ కోసం రక్తం కూడా చిందిస్తా.. చనిపోయే వరకు ఎంటర్‌టైన్ చేస్తా.. చరణ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్!
మీ కోసం రక్తం కూడా చిందిస్తా.. చనిపోయే వరకు ఎంటర్‌టైన్ చేస్తా.. చరణ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్!

Ram Charan : మీ కోసం రక్తం కూడా చిందిస్తా.. చనిపోయే వరకు ఎంటర్‌టైన్ చేస్తా.. చరణ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానుల ప్రేమకు భావోద్వేగంగా స్పందించారు. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా అనిపించడం లేదు. సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది. విజయవాడ మా నాన్నగారికి ఎంతో లక్కీ సిటీ. ఆ అదృష్టం నాకు కూడా కలిసొస్తుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చానని అన్నారు.

వివరాలు

'పెద్ది' కథ మాత్రం గుండెను తాకింది

సినీ ప్రయాణంలో ఎన్నో కథలు విన్నప్పటికీ, 'పెద్ది' కథ తన హృదయానికి అత్యంత దగ్గరైనదని చరణ్ పేర్కొన్నారు. "కొన్ని కథలు నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ 'పెద్ది' కథ మాత్రం గుండెను తాకింది. నాన్నగారు చెప్పినట్లుగా ఇలాంటి కథలు పదేళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఈ కథను నా వద్దకు తీసుకొచ్చిన దర్శకుడు బుచ్చి బాబు సానాకు, అలాగే సుకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు. 'పెద్ది' తన సినీ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని చరణ్ వెల్లడించారు. "ఈ సినిమా నాకు నటుడిగా అపారమైన సంతృప్తిని ఇచ్చింది. వ్యక్తిగతంగానూ నన్ను మంచి దారిలో నడిపించింది.

వివరాలు

బుచ్చిబాబు టాప్ డైరక్టర్ గా నిలుస్తారు

బుచ్చిబాబు ఈ కథను ఒక సినిమా కథలా కాకుండా, ఒక మనిషి జీవిత ప్రయాణంలా వివరించారు. కిందపడిన వ్యక్తి తిరిగి ఎలా నిలబడతాడో చెప్పే కథ ఇది అని అన్నారు. సినిమా కోసం తాను చేసిన కష్టంపై వస్తున్న ప్రశంసల గురించి స్పందిస్తూ, "ఇలాంటి గొప్ప కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?" అని వ్యాఖ్యానించారు. అలాగే బుచ్చిబాబు భవిష్యత్తులో భారతదేశంలోని టాప్ నలుగురు దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అభిమానుల గురించి మాట్లాడుతూ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. "ఇలాంటి సినిమాలు చేయడానికి కారణం మీరే. అభిమానుల ప్రేమ లేకపోతే మేమెందుకు సినిమాలు చేస్తాం? మీ కోసం చేతులు ఇరగ్గొట్టుకోవడమే కాదు, అవసరమైతే రక్తం చిందించి మరీ పనిచేస్తాను.

Advertisement

వివరాలు

అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా, పవన్ కళ్యాణ్ బాబాయ్ మేనల్లుడిగా మీ ప్రేమకు ప్రతిఫలం ఇవ్వడం నా బాధ్యత అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. నాకు తెలిసింది సినిమా... సినిమా... సినిమా మాత్రమే. చనిపోయేంత వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను. ఇది రాసిపెట్టుకోండి. ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు. అభిమానుల మధ్యే ఉండాలని ఉందని పేర్కొన్నారు. చివరగా 'పెద్ది' పాత్ర ఆత్మగౌరవాన్ని ప్రేక్షకులు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేసిన రామ్ చరణ్, విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు తమ చిత్రానికి ఉండాలని కోరుకున్నారు. సినిమా విడుదల తర్వాత అభిమానులు ఈ చిత్రాన్ని భారీ విజయంగా నిలబెడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Advertisement