LOADING...
Nandamuri Kalyan Ram : కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన అనిల్‌ రావిపూడి
కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన అనిల్‌ రావిపూడి

Nandamuri Kalyan Ram : కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన అనిల్‌ రావిపూడి

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని దర్శకుడు అనీల్‌ రావిపూడి అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం నుంచి కళ్యాణ్‌రామ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆదివారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్‌రామ్‌ సంప్రదాయ పంచెకట్టుతో, మెడలో పూలహారం ధరించి కనిపించడం విశేషం. ఆయన లుక్‌లో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ఉండటంతో అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

వివరాలు

కళ్యాణ్‌రామ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు..

జన్మదినం సందర్భంగా కళ్యాణ్‌రామ్‌కు అనిల్‌ రావిపూడి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన 'ఎక్స్‌'లో చేసిన పోస్టులో, ''నా తొలి హీరో, అలాగే నా అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరైన @NANDAMURIKALYAN గారికి జన్మదిన శుభాకాంక్షలు. దర్శకుడిగా నా తొలి అడుగులో నాపై మీరు ఉంచిన విశ్వాసానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. VenkyAnil5 #NKRAR2 చిత్రంలో మిమ్మల్ని ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను సర్‌. 2027 సంక్రాంతిని మరింత ఘనంగా జరుపుకుందాం'' అని పేర్కొన్నారు.

వివరాలు

2027 సంక్రాంతికి విడుదల..

ప్రతి సంక్రాంతికి తన సినిమాతో ప్రేక్షకులను అలరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అనిల్‌ రావిపూడి, వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా వెంకటేశ్‌, కళ్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న #VenkyAnil5 #NKRAR2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, 2027 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement