Rashmika: ఎవరి కోసమూ మారను.. ట్రోల్స్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్, విమర్శలపై నటి రష్మిక మందన్న స్పందించారు. తాను అందరితోనూ సరదాగా, స్నేహపూర్వకంగా ఉండటాన్ని కొంతమంది తప్పుపడుతున్నారని ఆమె అన్నారు. అయితే అలాంటి విమర్శలు, ట్రోలింగ్స్ చూసి తన ప్రవర్తనను మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 'రణబాలి' సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక పలు విషయాలను పంచుకున్నారు. 'నా ఉద్దేశంలో అందరితో మంచిగా ఉండడం బలహీనత కాదు. నేను ఉన్నచోట పాజిటివిటీ రావాలని సరదాగా ఉంటాను. దీనికి ఏ పేరు పెట్టినా ఫర్వాలేదు. అందరికీ నేను నచ్చాలని లేదు. నాకు ఇలా ఉండటమే ఇష్టం. నేను నాలా ఉండడానికి నటించాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికోసమో నేను మారలేను.
వివరాలు
అందుకే 'రణబాలి'కి ఓకే చెప్పా..
నేను సరదాగా ఉండడం వల్ల నా కుటుంబం, ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉంటారని రష్మిక తెలిపారు. 'రణబాలి' సినిమా తనకు చాలా ప్రత్యేకమని రష్మిక అన్నారు.
ఈ చిత్రాన్ని అంగీకరించడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సినిమాలో నటించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని చెప్పారు.
'దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సినిమాలో నటించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోలేదు.
ఇందులో విజయ్ దేవరకొండ హీరో అని తెలిసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకొని చాలా కాలమైంది.
వివరాలు
అక్టోబర్16న రిలీజ్
అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమని రష్మిక పేర్కొన్నారు. ఇక సినిమాలో తన జయమ్మ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇది చాలా ఎమోషన్‌తో కూడిన పాత్ర అని రష్మిక చెప్పారు.
ఈ పాత్ర ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అవుతుందని ఆమె పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.